తేనె లొలికించేటి తెలుగు భాష మనదే
వెన్నెల కురిసేటి వెలుగుల భాష వెన్నెలాంటి మెత్తనైన పదముల పలుకులు
సొంపైన సొగసైన సుసంపన్నమైనది
సాటి భాషలలోకెల్లా మేటిగా వెలిగేది
కృష్ణదేవరాయలు మెచ్చిన భాష యిది
దేశ భాషలందున లెస్సని
ప్రకటించే రాయలు
ఇటాలియన్ భాష వలే ఇంపుగా వినసొంపుగా మన భాష
రాళ్లు కరిగించేటి రమ్యమైనది భాష
అమ్మ నేర్పిన భాష అమృతమైనది
దేవతలు మెచ్చేటి దివ్య మై వెలిగేటి
మాతృభాషా నీకు మనసార వందనము
రమణీయమైనదీ
రాష్ట్రీయేతరులు కూడా మెచ్చేటి మన భాష
అన్య భాషల కంటె శబ్ద అర్థాల శ్రావ్యముగా వినబడు
వ్యావహారిక భాష వ్యంగ్య మైనది గూడ
నన్నయ మొదలెట్టిన నాణ్యమైన భాషియిదియే
శ్రీనాధుని సొగసులన్నీ సొంపుగా వినిపించె
మరో ప్రపంచమును చూపించెను
సినారెను సితార చేసెను
బాలు గళములో పలికించే సప్త స్వరాలు
పాఠశాలల యందు పావనమైన భాష
గిడుగు వారికెంతో కీర్తి తెచ్చిన భాష
పూల గుచ్ఛము వలే పొందుగా అమరేది
మా తెలుగు తల్లికి మల్లె పువ్వుల దండ ఇది
తెలుగులో మాట్లాడు
తెలుగులో పోట్లాడు
తెలుగులో ఆట్లాడు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి