బాల పంచపది
===========
వజ్రభారతిలో ఎగిరే జెండా
సిద్ధమైన దేశ భక్తి అజెండా
మూడురంగుల దివ్యజెండా
ముచ్చటైనదీ ముఖ్యఅండా
పింగళి వెంకయ్యకృషినిండా ఉమ!
నేలమీద వేయరాదు
జెండాను చించరాదు
తలకిందుల చెయ్ రాదు
తప్పుగాను పలకరాదు
గుండెనిండా మనజెండా ఉమ!
గుడి బడిలోన ఎగరాలి
గడబిడ లేకనే జరగాలి
విడిగాపూలు ఉంచాలి
ముడివిడి పూలురాలాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి