సుప్రభాత కవిత ; -బృంద
అవని అణువణువూ తాకే
అనుగ్రహం.

కొండాకోనా  మురిసి పలికే
ఆహ్వానం.

చెట్టూ చేమా చెట్టాపట్టాలుగా
చేసే నృత్యం.

శిఖరాల శిరసున మెరిసే
మాణిక్యం.

లోకాన తిమిరాలు తరిమే
కిరణం.

కరగని కష్టాలలో  ఊతమిచ్చే
ఉదయం

చెరగని నమ్మకాల చెదిరిపోక నిలిపే
ప్రచోదనం.

గుండె గుడిలో గంటలు మోగించు
ఆనందం.

ఎండే ఆశలకు చిగురుగా
మండే మనసులకు చినుకుగా

క్రమం తప్పక కురిపించే
కటాక్షం.

మిత్రుని ఆగమన వేళ
మురిసిన మనసుల హేల

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు