ఏకాగ్రత!అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం ఏపని చేస్తున్నా దాని పైనే ధ్యాస దృష్టి పెట్టాలి.బడిలో విద్యార్థులు టీచర్  ఇంట్లో వంట చేసే అమ్మ  ఉద్యోగం చేసే నాన్న  వారు వీరని లేదు  అంతా అలా ఉంటేనే పనులు సక్రమంగా సాగుతాయి. యోగ మెడిటేషన్ కూడా ఇదే చెప్తోంది. 

ఊరిచివర  ఓసాధువు ఉన్నాడు.ఎప్పుడూ దైవప్రార్థన  నామస్మరణ తప్ప ఇంకో ధ్యాస లేనే లేదు. ఊరివారు పాలు పళ్ళు  ఫలహారం పెట్టినా  అస్సలు వాటివంక కన్నెత్తి చూసేవాడు కాదు. ఒకరోజు రాజభటుడు ఆ ఆశ్రమం దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకుని కత్తిని తీసుకుని వెళ్లటం మర్చిపోయాడు.వారం రోజుల తర్వాత సాధువు దృష్టి దానిపై పడింది. "ఎవరిదీ కత్తి? ఇక్కడి కి ఎలా వచ్చింది?" అనే మీమాంస బయలుదేరింది.ఆమర్నాడు తన దగ్గరికి వచ్చినవారిని దాన్ని గూర్చి అడిగాడు. " మాకేం తెలీదు స్వామి! పాలు పండ్లు అక్కడ పెట్టి పోతాం"అన్నారు రోజూ వచ్చే ఆవృద్ధ భక్తులు! తమాషా ఏమిటంటే ఆరోజు నించి సాధువు ఆకత్తిని దాని యజమానిని గూర్చి ఆలోచించటం మొదలు పెట్టాడు."ఈకత్తి  నాకుటీరంలో ఉన్నంత కాలం దీన్ని కాపాడే బాధ్యత నాదే" అనుకుంటూ రోజూ దాన్ని శుభ్రం చేసేవాడు. ఓం నమశ్శివాయ అనే జపంమానేసి ఆకత్తిని ఎవరన్నా కాజేస్తారేమో అని సందేహంతో ఉండేవాడు.పైగా తన దగ్గరే పెట్టుకుని తను ధ్యానం లో మునిగితే ఎవరైనా కాజేస్తారేమో అనే అనుమాన పిశాచం పట్టుకుంది.తను బైటకి వెళ్తున్నా  దాన్ని తనవెంటే ఉంచుకుంటున్నాడు.ఒక సారి  ఆఇద్దరు భక్తులు అడిగారు"స్వామి!మీరు  కత్తి తో తిరుగుతున్నారేంటి?" అని. "ఎవరో సైనికుడు మర్చిపోయి ఉంటాడు. అతను కనపడితే తన కత్తిని గుర్తిస్తాడుకదా" "అతనే మీకుటీరానికి వస్తాడేమో?మీరు తిరగడం ఎందుకు?" దాని కి జవాబు చెప్పేవాడు కాదు. "పాపం!సాధువుది ఎంత మంచి మనసు? పరులసొమ్ముని ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నాడు"అని అంతా పొగిడేవారు. ఒకరోజు సాధువుకి ముళ్లపొదలు కన్పడితే చేతిలోని కత్తి తో వాటిని నరికేశాడు.క్రమంగా పాముపుట్టలు చిదపేశాడు.కోడిని గ్రద్ద తన్నుకుపోతుంటే కత్తిని విసిరి దాని రెండు కాళ్లు నరికాడు.ఎలుకను తరుముతున్న పిల్లిపై కత్తి విసిరాడు. తను సాధుప్రాణులకి  మంచి చేస్తున్నా అనుకుని అంతా చెడుతలంపులతో పతనమైనాడు.హింసాప్రవృత్తి అతనిలో పెరిగి దుర్మార్గునిగా మారాడు.అందుకే  మనం ఎప్పుడూ మంచి గా ఆలోచిస్తూ మంచి పనులే చేయాలి. లేకుంటే  మనం నైతిక పతనం చెందుతాం🌹


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం