రాల్ఫ్ పార్లెట్ (Ralph Parelette) అమెరికాకు చెందిన గొప్ప వక్త. ఆయనోమారు "విధిరాత" అనే ఆంశం మీద మాట్లాడటానికి ఓ గాజు జాడీతో వేదికపైకొచ్చారు.
ఆ జాడీలో చిక్కుడు గింజలు, వాల్ నట్స్ (Walnuts - అక్రోటు) ఉన్నాయి. ఒకటి చిన్నవి. మరొకటి పెద్దవి. జాడీని కిందకూ పైకీ పైకీ కిందకూ కుదిపారు. అనంతరం ఆ జాడీని ప్రేక్షకులకు చూపించారు. పెద్దవైన వాల్నట్స్ జాడీలో పైభాగాన, చిన్నపాటి చిక్కుడు గింజలు అడుగు భాగాన ఉన్నాయి.
"మిత్రులారా! ఈ చిక్కుడు గింజలలో ఒకటి నన్ను సాయం చేయమని కోరింది. దాని ఆశ ఏమిటంటే తాముకూడా వాల్నట్సుకి సమానంగా పైభాగాన ఉండాలని. నేనిప్పుడు అందుకు సాయపడబోతు న్నాను. మీ సమక్షంలోనే ఆ చిన్నపాటి చిక్కుడు గింజను పైభాగాన పెట్టాను. చూడండి. ఆహా! ఇప్పుడా చిక్కుడు గింజకు ఎంత సంతోషమో చెప్పలేను" అన్నాడాయన.
ఆయన జాడీని మళ్ళీ కిందకూ పైకీ పైకీ కిందకూ కుదిపారు.
"అరెరె! ఆ కుదుపులో చిక్కుడు గింజ మళ్ళీ యథాస్థానానికి అంటే అడుగుకి పోయింది!
ఆ చిక్కుడు గింజకు ఎంత బాధో? సమానత్వం లేదే అని కలతపడింది. అది మళ్ళీ నన్ను చూసి వేడుకుంది. నేను పైభాగాన ఉండకపోయినా పర్వాలేదు. వాల్నట్స్ తమకు సమానంగా అడుగు భాగాన ఉండాలి" అని!
"సరే. అలాగే చేసి చూద్దాం. చూడండి. మీ సమక్షంలోనే వాల్నట్ ఒకటి తీసి చిక్కుడు గింజల అడుగున ఉంచానన్నారు. ఇప్పుడు జాడీని బాగా కుదిపారు. పూర్వంలాగానే వాల్నట్ పైభాగానికి వచ్చేసింది. చిక్కడు గింజలు అడుగు భాగంలోనే ఉన్నాయి.
"మిత్రులారా! ఇది ప్రకృతి నియమం. పరిమాణంలో చిన్నవి అడుగున, పరిమాణంలో పెద్దవి పైనా ఉంటాయి. ఇది సహజం. చిక్కుడు గింజలు పైభాగానికి రావాలంటే ఒక్కటే మార్గం. అవి పెద్దవిగా ఎదగాలి. అంతేతప్ప మనం ఎంత సాయం చేసినా అవి ఎదగనంటే చేసేదేమీ లేదు. కింద ఉండాల్సిందే. మరోదారి లేదు. ఎవరెంత సాయం చేసినా కాలక్రమంలో అవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి" అన్నారు.
మరొక్క విషయం, చిక్కుడు గింజలూ వాల్నట్స్ తమ ఆశ మేరకు తమను మార్చుకోలేవు. కానీ మనిషి విషయానికొస్తే మనం కృషి చేస్తే ఏమైనా జరగొచ్చు. దేవుడు మనల్ని చేతకానివాడిలా పుట్టించలేదు. మనం ఎదగాలంటే తప్పనిసరిగా ఆ దిశలో కృషి చేయాలి. అలా ప్రయత్నించడం మాని మనకు మనం అంతా విధిరాత అనుకుంటాం. హెచ్చుతగ్గులన్నీ విధిరాతంటూ దాని మీదకు నెట్టెస్తామన్నారు.
ఇదెంత అఉదమైన నిజమో కదూ!
రాల్ఫ్ పార్లెట్ చిక్కుడు గింజలాగానే మనలోనే చాలా మంది ఉన్నాం. ఎవరైనా ఏదైనా చేసి మనల్ని ఓ ఉన్నత స్థితికి తీసుకుపోతే బాగుంటుందని అనుకుంటాం.
అలా ఎదురు చూస్తూ ఉత్తినే ఉండే కాలంలో చెయ్యవలసిన దానిలో సగమన్నా సరిగ్గా చేసి పూర్తి మనసుపెడితే మనమనుకునే ఉన్నతస్థాయికి అవసరమైన సకల అర్హతలను మన కృషితో మనమే రూపొందించుకోవడం సాధ్యమే.
ఎవరి దయాదాక్షిణ్యాలు లేకుండా మన లక్ష్యాలను మనమే సాధించుకోగలం. అలాకాకుండా మంచి తరుణం కోసమో ఎవరి సాయం కోసమో అదృష్టం కలిసొస్తుందనో నిరీక్షిస్తుంటే ఉన్న చోటనే ఉండాల్సిందే. అది విధి అంటే.
కనుక జ్ఞానాన్ని పెంచుకోవాలి. అర్హతను సంపాదించాలి. కాలానికి తగ్గట్టు శక్తియుక్తులు, సామర్థ్యాన్ని ఆచరణలో పెట్టాలి. వీటితోనే అనుకున్నది సాధించగలం. అప్పుడు మనల్ని వెతుక్కుంటూ అవకాశాలూ వస్తాయి. వాటిని అందిపుచ్చుకోవాలి. ఇదే సహజత్వం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి