సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
  కలత... నలత*
    ******
మనసుకు బాధ కలిగించేది కలత.తనువును బాధ పెడుతుంది నలత.
మనిషన్నాక కలతలు,నలతలూ రావడం చాలా చాలా సహజం.అవి రాకుండా ఆపడం ఎవరి తరమూ కాదు.
కలత,నలత ఏదొచ్చినా కష్టమే.
సున్నితమైన హృదయం, సుకుమారమైన దేహమైతే  మరీ మరీ కష్టం.
కల్లోల కడలిలా ఆందోళన పడుతుంటారు.చిగురుటాకులా వణికి పోతుంటారు.
మన జీవన గమనంలో  బంధువులు, స్నేహితులు మనసుకు నచ్చని విధంగా ప్రవర్తించినా, మన ఆలోచనా ధోరణిని అపార్థం చేసుకున్నా మనసు కలత చెందుతుంది.
వాతావరణంలో మార్పుల వల్లనో, ఇతరత్రా కారణాల వల్లనో  శరీరం నలతకు గురవుతుంటుంది.
వీటిని గురించి అతిగా ఆలోచిస్తే కలత వలన శరీరం నలతకు గురి కావడం, నలతతో వచ్చిన భయం వలన మనసు కలత చెందడం జరుగుతుంది.
కాబట్టి వీటిని గురించి అతిగా  ఆలోచించి మనశ్శరీరాలను నలగకుండా చూసుకోవడం శ్రేయస్కరం. 
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు