సుప్రభాత కవిత ; -బృంద
నిత్య నిరీక్షణ నిశిదైతే
సత్య సుందరమైన వెలుగు 
వేకువది.

నిదుర రాని కళ్ళకు
కాంతులు నింపేది....

కుదురు లేని మనసుకు
నమ్మకమిచ్చేది....

నిట్టూర్పుల నిరాశకు
ఆశలు రేపేది....

వేధించే వ్యధలకు 
ఓదార్పు నిచ్చేది....

శోధించే కష్టాలకు
దారిచూపేది.

తల్లడిల్లు తలపులకు
కళ్ళనీరు తుడిచేది...

నిర్వేదపు నిరాసక్తికి
ఆశలు రేపేది..

గాయాలకు ఔషధమై
నయం చేసేది.

వెలివేసిన కలలను
సాకారం చేసేది...

అయిన  గొప్ప ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు