చలికీ జై! ;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 చలికాలం వచ్చిందీ
గజగజలే తెచ్చిందీ
చలిమంటను వేయించిందీ
చలి రగ్గును కప్పించిందీ 
ఊలుస్వెటర్లు తొడిగించిందీ 
రాత్రి సమయం పెంచిందీ 
పగటి సమయం తగ్గించిందీ
మామిడి చెట్లన్నీ పూయించిందీ
చింతచెట్లన్నీ కాయించిందీ 
సంక్రాంతి పండుగ తెచ్చిందీ
క్రిస్మస్ పండుగ తెచ్చిందీ 
రంగుల సింగిడి ముంగిటవచ్చే
ముత్యాల ముగ్గులు తెచ్చిందీ 
రంగురంగుల హరివిల్లుల్లాగా 
గాలిపటాలు ఎగిరేయించింది 
జనాలు అందరు సుఖపడేలా 
పంటలు ఇంటికి తెచ్చిందీ
అందుకె అందుకె చలికీ జై !!
*********************************

కామెంట్‌లు