భారతీయ జెండా! ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఎత్తుకోండి మువ్వన్నెల జెండా 
భారతీయ జెండా 
మన హృదయం నిండా
ముచ్చటైన జెండా
మాననీయ జెండా 
!! ఎత్తు!!
కులమత భేదాలు లేవు 
తరతమ భేదాలు లేవు
మన మంతా బంధువులం 
భారతీయులం మనం
భారతీయులం మనం 
!!ఎత్తు!!
పవిత్రత త్యాగమూ
అందించును కాషాయం
నిర్మలమగు దేశభక్తి 
శ్వేతవర్ణ ప్రతిరూపం
పాడిపంటల సంకేతం
హరిత వర్ణ శోభితం 
ఈపతాక ఛాయలోని
సస్యశ్యామల దేశం 
!!ఎత్తు!!
భారతీయుల దేశభక్తికి
భారతీయుల ధీరశక్తికి
ఈ జెండయె ప్రతిరూపమూ
దీని గౌరవించుటయే
మన కర్తవ్యమూ
!! ఎత్తు!!

కామెంట్‌లు