అతిశయంగ అగుపించే
అందమైన రవికిరణం
ఎంతగానో ఎదురుచూసిన
మధురమైన ఈ క్షణం
రెప్ప వెనుక స్వప్నాలన్నీ
కంటి ముందుగ తోచురీతి
దూసుకొచ్చిన వెలుగు చూసి
మనసు పాడె మధుర భావగీతి
వెలుగు నిండగ లోకమంతా
కనుల పండుగ కాలమంతా
మూగబోయిన రాగాలన్నీ
మౌనంగా మోగసాగెను
నిదురలేచిన కోటి ఆశలు
మోసులొచ్చి మొగ్గ తొడిగెను
తొలకరించిన ఉదయంలో
పులకరించిన హృదయం
పెదవి పలుకని మాటలన్నీ
ఊహలుప్పొంగ పాడసాగె
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి