రాఖీ పూర్ణిమ ;--ఎం. వి. ఉమాదేవి
ఆట వెలది 

అమ్మకడుపు చలువ యన్నచెల్లెలుమధ్య 
మమతయుండు నెపుడు మరువరాదు 
రాఖి పూర్ణిమట్లు రక్షణ గలిగించు 
రక్త బంధమిదియె రమ్యముగను !

అన్నదమ్ముల చేతి నామెకట్టిన రాఖి 
యతని జీవగర్ర యద్భుతముగ 
వెతలులేని బతుకు వేడుక జేయంగ 
శుభము గోరుమదికి శోభితమ్ము !

కామెంట్‌లు
Unknown చెప్పారు…
అన్నదమ్ముల చేతి
ఇక్కడ గణ భంగం కలిగింది మేడం