దత్తపది పూరణ (చీమ, దోమ,భామ, రామ)-ఎం. వి. ఉమాదేవి. బాసర.
మత్త కోకిల 

చీమలన్నియు సమ్మె జేసెను చింతతోడను తీపికిన్ 
దోమలన్నియు కుట్టసాగెను దోరరక్తము మింగుచున్ 
భామలందరు వంటమానిరి భవ్య సోకులు జేయగన్ 
రామ రాజ్యము మచ్చుకైనను రమ్యరీతిని చూతుమా !?


కామెంట్‌లు