*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0146)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*గోలోకము - విష్ణువునకు గణేశ్వర పదవి - శ్రీరాముడు సతీదేవి సందేహం తీర్చడం - శివుడు సతీదేవిని మానసికముగ పరిత్యజించుట*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*వేదములు కూడా నా ఆజ్ఞతో నన్ను కీర్తించిన విధంగానే, ఈ రోజు నుండి గణాధికారం పొందున విష్ణుమూర్తి ని కూడా స్తుతించాలి. శ్రీహరీ! నీవు నా ఆదేశంను అనుసరించి సకల లోకాలకు కర్తవు, పాలకుడవు, సంహారకుడవు కూడా అవుతావు. మంచి మార్గంలో వున్న వారిని అనుగ్రహిస్తూ, చెడు వైపు వెళ్ళే వారిని శిక్షిస్తావు. నీవు జగదీశ్వరుడవు. నిన్ను యుద్ధంలో ఎవరూ గెలవలేరు. ఇచ్చా శక్తి, లీలా శక్తి, నిత్య స్వాతంత్ర్యం అనే మూడు శక్తులను నీకు ఇస్తున్నాను. శ్రీహరీ! నిన్ను ద్వేషించేవాడు నా చేత శిక్షింపబడతాడు. నీ భక్తలు నావల్ల మోక్షము పొందుతారు. నీకు మాయను కూడా ఇస్తున్నాను. ఈ మాయను బ్రహ్మాది దేవతలు కూడా జయించలేరు. నీవు బ్రహ్మకు తండ్రివి అయి ఆతని పెంపునకు తోడ్పడుతావు. నా హృదయ రూపమగు రుద్రడనే నేను. రుద్రుడు నీతో సహా సకల దేవీ దేవతా గణములకు నిత్య పూజ్యడు. ఈ భూమండలములో నీవు అనేక అవతారములు ధరించి, అందరినీ రక్షింపుము. నీ అవతారములు అన్నీ పూజనీయాలే. ఇలా విష్ణుమూర్తికి వివిధ వరాలు ఇచ్చన శివుడు సతీదేవి సమేతంగా కైలాసానికి ప్రయాణం అయ్యారు.*
*శివుని ఆజ్ఞ అనుసరించి వివిధరూపాలు ధరించి విష్ణువు ఈ భూమిని పాలిస్తున్నాడు. ఆ విష్ణుమూర్తి, శేషుడు, శంఖ, చక్రములతో కలసి దశరథ మహారాజు ఇంట్లో రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగా అవతరించారు. లక్ష్మీ దేవి సీతగా వచ్చింది. ఈ దండకారణ్యంలో, రావణుడు సీతను అపహరిచగా, నేను లక్ష్మణుడు వెతుకుతున్నాము. అప్పుడే మీరు ఇద్దరు నన్ను చూచారు. శంకరుడు అత్యంత కరుణతో నాకు నమస్కరించడం జరిగింది. తరువాత జరిగింది నీకు తెలిసిందే కదా, జగన్మాత అని రాముడు, సతీదేవి అనుమానాన్ని తొలగిస్తాడు.*
*ఈ వృత్తాంతం విని సతీదేవి తనలో తాను ఎంతైనా మధన పడుతుంది. శివభగవానుడు చెప్పిన మాట వినకుండా రాముని అవమాన పరిచాను. శ్రీమన్నారాయణుడే శ్రీరాముడు అని తెలిసి సతీదేవి తన మనసులో కీర్తిస్తూ ఎంతో సంతోషాన్ని కూడా అనుభవిస్తుంది. కానీ, తన ప్రాణ నాధుని మాట వినలేదు అనే బాధతో అన్య మనస్కురాలుగా వుంటుంది, సతీదేవి.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు