*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0152)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*మహత్తరమైన దక్ష యజ్ఞము - దేవతలు అందరూ రావడం - దధీచి శివుని ఆహ్వానించమని చెప్పడం - శివభక్తలు వెళ్ళి పోవడం*
*బ్రహ్మ, నారదునితో ఇలా చెప్పాడు -* 
*దధీచి మాటలకు, దక్షుడు "సకలములకు మూలమై, తనలో సనాతన ధర్మాన్ని నిలుపుకున్న విష్ణుమూర్తి ఇక్కడ వున్నారు. విష్ణువు అందరు దేవతలకు సమానము. అటువంటప్పుడు ఇక యజ్ఞమునకు లోటు ఏముంటంది. ఈయనలో యజ్ఞము, వేదములు, అన్ని కర్మలు వున్నాయి. వేదములు, ఉపనిషత్తులతో బ్రహ్మదేవుడు, సకల మునులు, దేవగణములు ఇక్కడ వున్నారు. వేదార్ధ తత్వమును తెలుసుకుని, పాపరహితులై, యజ్ఞమును సంపూర్ణము చేయగల మహర్షులు వచ్చారు. నా తండ్రి అయిన బ్రహ్మ చెప్పారు కనుక, నా కుమార్తె సతిని ఇచ్చి రుద్రునికి వివాహం చేసానుగానీ, ఎప్పుడూ శ్మశానంలో తిరుగుతూ, కపాలం లో బిక్షమెత్తుకుంటూ, ఒంటి నిండా విభూతిని రాసుకుని, దేశాలు పట్టుకుని తిరిగే రుద్రుని తో ఇక్కడ, ఈ యజ్ఞ స్థానంలో పని ఏముంది. పైగా, రుద్రునికి తల్లితండ్రులు లేరట, ఒక కులము, గోత్రము లేదట, భూత, ప్రేత, పిశాచాలకు అధిపతి అట. ఎంతసేపు తనను తాను పొగుడుకుంటూ, మూరఖత్వాన్ని ప్రదర్శిస్తూ, జడుడు లాగా ఉంటాడు. ఈర్ష్యతో నిండి పోయి వుంటాడు. కాబట్టి, దధీచి, మీరందరూ కలసి నా ఈ యజ్ణమును సఫలము చేయండి. ఆ రుద్రుని ప్రసక్తి ఎందుకు" అని సభాసదులను ప్రార్ధిస్తాడు దక్షుడు.*
*దక్షుని మాటలు విని, మరీ ఎక్కువగా కలిగిని బాధను అణుచుకోలేని దధీచి, "దక్షా! ఇది అంతా నీ నాశనానికే దారితీస్తుంది" అని చెప్పి యజ్ఞ స్థలిని వదలి వెళ్ళిపోతాడు. ఆతని వెంట సమస్త శివపార్షదులు నిష్క్రమిస్తారు. "మనసులో ఆలోచనా శక్తి నశించి, మిధ్యావాదంతో మాట్లాడుతూ, వేదములు మెచ్చని దురాచారములను పాటించే దధీచి ఒక్కడు, శివపార్షదులతో వెళ్ళి పోయినందువల్ల ఈ యజ్ఞమునకు ఏమీ నష్టము కలుగదు. ఇక్కడ విష్ణుమూర్తి, బ్రహ్మ మిగిలిన వేదాంతులు, మహర్షులు వున్నారు. మీరందరూ నా ఈ యజ్ఞమును పూర్త చేసి నాకు మంచి ఫలము ఒచ్చేటట్టుగా చేయండి" అని సభను కోరుతాడు దక్షుడు.  కానీ, తన మనసులో వేళ్ళూనిన శివ ద్వేషాన్ని తగ్గించుకోవడానికి, తోలగించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు.  శివుని మాయా మోహితులైన మహర్షులు హవన కార్యక్రమం మొదలుపెట్టారు. యజ్ఞము ప్రారంభించారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు