*చంపకమాల:*
*సలలిత రామనామ జప | సార మెరుంగను, గాశికాపిరీ*
*నిలయుఁడగాను, నీచరణ | నీరజ రేణు మహా ప్రభావముల్*
*దెలియ నహల్యఁగాను, జగ | తీవర నీదగు సత్యవాక్యముల్*
*దలఁపగ రావణాసురుని | తమ్ముఁడగాను, భవద్విలాసముల్*
*తలఁచి నుతింప నాతరమె | దాశరధీ !కరుణాపయోనిధీ !.*
తా: సముద్రమంతటి దయను సొంతం చేసుకున్న, రఘు రామా! ఎంతో గొప్పదై, మనోహరంగా వుండే నీ నామ జపం ఎప్పుడూ తెలుసుకో లేదు. కాశీ నగరంలో వుండే శివుడిని కాదు. నీ పద్మపాదములకు అంటిన మట్టి యొక్క మహిమ తెలియడానికి నేను అహల్యను కాదు. ఈ ప్రపంచానికే మహారాజువు అయిన నీ సత్యవాక్పరిపాలన తెలుసుకో గలగడానికి రావణుని తమ్ముడైన విభీషణుడు కాను. నీ మహిమలు తెలుసుకోవడం నావల్ల అవుతుందా దశరధరామా!..... అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*నీ అద్భుతమైన సృష్టిలో నేను ఒక చిన్న మనిషిని. నీవే స్వయంగా వచ్చి చెప్పినా కూడా నీ గొప్పతనాన్ని నేను తెలుసుకో లేను. ఏదిఏమైనా ఈ జగత్తులో నేనే గొప్ప అనుకునే వాడిని. అన్నీ నావే. అంతా నేనే అని నమ్మకం తో వున్నవాడిని. కానీ, ఒంట్లో శక్తి సన్నగిల్లుతుంటే, ఒక్కొక్క బంధం విడిపోతుంటే, ఎక్కడో అనుమానం మొలుస్తోంది, అన్నీ నావే, అంతా నేనే అనే నా నమ్మకం నిజం కాదేమో అని. పరాత్పరా, పరమేశ్వరా, రామభద్రా! నీవు తప్ప నాకు దిక్కెవ్వరూ లేరని. నువ్వు తప్ప ఎవరూ రక్షించలేరని. నార! నార! అన్నవానికే మోక్షము ఇచ్చావని చెప్పారు. మర! మర! అన్నవానిని మహా కవిని చేసావని విన్నాను. నాకు సత్సంగంలో వుండే అవకాశమిచ్చి, నీ నామ స్మరణలో తరింపజేయి, సర్వేశ్వరా!.......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి