*ఉత్పలమాల:*
*పాతకులైన మీ కృపకు | బాత్రులుకారె తలంచి చూడఁ, జ*
*ట్రాతికిఁగల్గె భావన, మ | రాతికి రాజ్యసుఖంబుగల్గె దు*
*ర్జాతికి బుణ్యమబ్బెఁ, గపి | జాతి మహత్వము నొందెఁ, గావునన్*
*దాతవ యెట్టివారలకు | దాశరధీ !కరుణాపయోనిధీ !.*
తా: సముద్రమంతటి దయను సొంతం చేసుకున్న, రఘు రామా! ఎన్నో పాపాలు చేసిన వారు కూడా మీ దయను, కృపను పొందగలిగారు. బండరాయి గా పడివున్న అహల్య తన చేతనత్వాన్ని తిరిగి పొందింది. శత్రవు అయినప్పటికీ విభీషణుడు రాజ్యాధికారం పొందాడు. సృష్టిలో అతి చిన్నప్రాణులకు కూడా పుణ్యం లభించింది. అల్లరి మూకలవంటి కోతులు నీ దయ వల్ల కపీశ్వరులు అయ్యారు. ఎంతటి వారినైనా, ఎంత పాపాత్ములకు అయినా నీ దయను, కరుణను పంచిపెడుతుంటావు కదా! కారుణ్యధామా! కమనీయనామా! ..... అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*"కారుణ్యధామా! కమనీయనామా! శ్రీరామ జయరామ సీతారామా!" ఎంత హాయి కలుగుతోంది మనసుకు ఈ వాక్యం చెప్పుకున్నా, తలచుకున్నా! ఇంత చక్కని నామం మనకు ఇచ్చిన పరమేశ్వర పరంధామ పరాత్పరునికి ఎన్ని నమస్కారాలు చేస్తే మన కృతజ్ఞతలు చెప్పుకో గలుగుతాము. "శ్రీ రఘు రాం ! జయ రఘు రాం ! సీతా మనోభి రాం !", "రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే ! రఘునాధాయ నాధాయ సీతాయాఃపతయే నమః" ఇలా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా, ఆ రామ నామ తేనెను ఎన్ని విధాలుగా సేవించినా, తవి తీరదు, రుచి తగ్గదు. పైగా పుణ్యం, పురుషార్ధం మనకు చేకూరుతాయి. ఇంత కమ్మని నామ స్మరణ మరపున పడిపోకుండా వుండేలా చేయమని ఆ పుణ్యశ్రవణునే వేడుకుందాము....*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి