*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 061*
 *చంపకమాల:*
*జలనిధులేడు నొక్క మొగిఁ | జక్కికిఁదెచ్చె శరంబు రాతినిం*
*పలరఁగ జేసెనాతిగబ | దాబ్జ పరాగము, నీ చరిత్రమున్*
*జలజభవాది నిర్జరులు | సన్నుతి సేయఁగ లేరుఁ గావునన్*
*దలఁప నగణ్యమయ్య! యిది | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: కరుణా నిధివైన! దశరధరామా!  నీ ధనుస్సు నుండి వెలువడిన బాణము సప్త సముద్రాలను ఒకచోటికి తెచ్చేసింది. పద్మములవంటి నీ పాదాలకు అంటుకున్న మట్టి రేణువు, బండరాతిని అందమైన స్త్రీ గా మార్చింది. బ్రహ్మ మొదలైన దేవతలు కూడా నీ పుణ్య చరిత్రను కీర్తించడంలో అసమర్ధులు అవుతున్నారు. లెక్క పెట్టలేనంత కీర్తి కలిగినవాడా, రామచంద్రా, నీకు నమస్కారాలు ప్రభూ !... అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*భద్రాచల రామదాసు గారికి పరమాత్ముని ఔన్నత్యాన్ని, అతులితమైన శక్తిని ఎన్ని సార్లు, ఎన్ని విధాలుగా కీర్తించినా తృప్తి రావట్లేదు. ఒకటికి పదిమార్లు చెపితేగానీ మన మట్టి బుర్రలకు రామ తత్వం ఎక్కదు అని ఆ రాముడు ముందే కంచెర్లగోపన్నకు చెప్పి వుంటారు. అందుకే, మన మదిలో రామ మంత్రాన్ని నిస్సంశయంగా నిలబెట్టాలి అనే తన బలమైన కోరికను తీర్చుకునే ప్రయత్నం వదలటల్లేదు. చాలా వరకు కృతకృత్యులు అయ్యారు కూడా. కాకపోతే, ఈ రోజు మనం ఇలా వుండగలమా, పరమేశ్వర కటాక్షం తప్ప. అమ్మ చల్లని చూపులతో, అయ్య తోడ్పాటు మనకు ఎల్లప్పుడూ వుండేలా అమ్మ అనుగ్రహం కోరుకుంటూ........*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు