గురజాడవేంకటఅప్పారావు 160 వ జయంతి-పద్యాంజలి!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్---చరవాణి :- 6300474467
 01.

తే.గీ.
దేశభక్తిగీతమ్మునుతీర్చిదిద్ది
సంఘసంస్కర్తగాతానుసాగిపోయి
వ్యావహారికభాషకునావయయ్యి
తెలుగుపాలసంద్రమ్ములోతళుకులీనె!!!

02.

తే.గీ.
భార్యభర్తలకన్యోన్యపాత్రనిల్పి
"కాసులు"నుసృజియించెనుకమ్రమొప్ప
"దిద్దుబాటు"కథనువ్రాసివొద్దికగను
మిగులసంస్కారమునునేర్పెమేటిగాను!!!

03.

తే.గీ.
కన్యకను,పూర్ణమ్మలనెడికవితలల్లి
సంఘమందునయానాడుసంగతులను
కళ్లకునుకట్టినట్లుగాకానిపించు
విధమురచియించెగురజాడవివరముగను!!!

04.

తే.గీ.
గిడుగురామ్మూర్తిబాటలోయడుగువేసి
కందుకూరితోచెలిమినియందుకొనియు
వెలుగురేఖలుచిందించివిశ్వకీర్తి
పొందెసాహితీవనమందుముదముతోడ!!!

05.

తే.గీ.
నవ్యకవితలకాతండునాంది,స్ఫూర్తి
భవితకొసగియుసమతనుపంచినట్టి
జాడజూపినగురజాడవాడిపోని
కుసుమమై,భారతినుదుటకుంకుమయ్యె!!!


కామెంట్‌లు