మ‌హిళ‌ల టీ20 క్రికెట్ టీంలో తాండూరు అమ్మాయి;-వెంకట్ --మొలక ప్రతినిధి: వికారాబాద్ జిల్లా
 – అండ‌ర్ -19 విభాగంలో ఎంపిక చేసిన బీసీసీఐ
– చెన్నై టోర్న‌మెంట్‌లో స్టాండ్ బైగా అవ‌కాశం
   వికారాబాద్ జిల్లా   తాడూరు, : బీసీసీఐ మ‌హిళ‌ల టీ20 క్రికెట్ జ‌ట్టులో తాండూరు అమ్మాయికి చోటు ద‌క్కింది. అండ‌ర్-19 విభాగంలో తాండూరుకు చెందిన క‌ల్ప‌న అనే అమ్మాయిని ఎంపిక చేశారు.
 వ‌చ్చేనెల అక్టోబ‌ర్‌లో చెన్నైలో నిర్వ‌హించే బీసీసీఐ మ‌హిళ‌ల టీ20 టోర్న‌మెంట్‌లో స్టాండ్ బై ప్లేయ‌ర్‌గా పాల్గొన‌బోతోంది. వివ‌రాల్లోకి వెళితే తాండూరుకు చెందిన క‌ల్ప‌న అనే క్రీడాకారిణి తాండూరు క్రికెట్ జోన్ అకాడ‌మిలో శిక్ష‌ణ తీసుకుంది.
 క‌ల్ప‌న అన్న క‌ళ్యాణ్ ప‌వార్ కూడ క్రికెట‌ర్‌గా రాణిస్తున్నారు. ఇక్క‌డి నుంచి హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ ద్వారా బీసీసీఐ అండ‌ర్-19 విభాగంలో క‌ల్ప‌న‌ను బీసీసీఐ టీ20 మ‌హిళ‌ల జ‌ట్టుకు ఎంపిక చేశారు. 
ఈ సంద‌ర్భంగా జ‌ట్టుకు ఎంపికైన క్రీడాకారిణి క‌ల్ప‌న మాట్లాడుతూ తాండూరు నుంచి తొలిసారిగా రాష్ట్ర‌స్థాయి మ‌హిళ‌ల జ‌ట్టుకు ఎంపిక కావ‌డం సంతోషంగా ఉంద‌ని తెలిపింది. త‌న అన్న క్రికెట‌ర్ కావ‌డంతో ఆయ‌న‌తో పాటు ఆట‌లో శిక్ష‌ణ తీసుకోవ‌డం జ‌రిగింద‌ని, అమ్మ‌, నాన్న‌లు కూడ ప్రోత్స‌హించార‌ని తెలిపింది.
 అవ‌కాశం వ‌స్తే టోర్న‌మెంట్లో స‌త్తా చాటుతాన‌ని చెప్పింది.

కామెంట్‌లు