ఎదుటి వారి గురించి ఏదైనా మాట్లాడవలసి వస్తే ముందు తనను తెలుసుకొని వారి మనసులను ఏమైనా బాధ పెడుతున్నానా అని ఆలోచించిన తర్వాతనే వారి నోటి నుంచి ఆ వాక్యం బయటకు వచ్చి అందరి ప్రశంసలను పొందుతుంది. రామాయణంలో వాల్మీకి మహర్షి లక్ష్మణుడికి శ్రీరామచంద్రునితో చెప్పించిన విషయం ఎలా మాట్లాడాలి అనేది ప్రపంచానికి చెప్పడం కోసం రాముని ఆధారం చేసుకొని చెప్పాడు. చదివినది మర్చిపోయే ఈ రోజుల్లో దానిని జీవితానికి అన్వయించుకుంటూ ధర్మ మార్గంలో జీవిస్తున్న వాడు మా శివనాగిరెడ్డి. అందుకే అందరితోనూ కుటుంబ సభ్యులలాగా మెలుగుతారు వారి దగ్గర నేర్చుకోవలసిన గుణాలు ఎన్నో ఉన్నాయి. కార్యసాధకుడు ఎవడు వెను తిరిగి వెళ్ళరు ఏది చేయాలనుకున్నారో దానిని సాధించి తీరుతారు భారతంలో ఒక నపుంసకత్వ పాత్రధారి (బృహన్నల) అర్జునుడితో చెప్పిస్తాడు వ్యాసుడు నిల్చి గెల్చిన సత్కీర్తి నెగడుగాక దవ్వుదవ్వుల నిట్లయిన నవ్వరెట్లు అన్నది శివనాగిరెడ్డి జీవితానికి సరిగా సమన్వయ పడుతుంది. ఎవరి అవహేళనకు గురై తాను అనుకున్న విద్యను సాధించాలని అనుకున్నాడో దానిని సాధించి చూపిన సాహసి. సామాన్యంగా ఏ కళాకారుడికైనా తాను చేసిన పని తనకు నచ్చదు ఇంకా బాగా చేయాలి అనిపిస్తోంది. జక్కన్న గారు ఉన్నారు దేశంలోనే గొప్ప స్థపతిగా పేరు గాంచారు. వారిని మించిన వారు మరొకరు లేరు అనుకున్నారు ప్రజలు కానీ తన శిల్ప సంపద తనకు నచ్చలేదు మధ్యలోనే వదిలేశారు. ప్రపంచ చిత్రకారులలో అగ్రగణ్యుడైన రవివర్మ భగవంతుడు అంటే ఇలాగే ఉంటాడు అన్నట్లుగా చిత్రాలను గీసి మనకందించిన వాడు మానసిక విశ్లేషణతో ఆయన చెప్పే విషయం ఏమిటంటే తాను ఏ బొమ్మను గీయ్యాలనుకుంటున్నాడో దానిని ముందు తన మనో ఫలకం మీద ముద్రించుకుంటాడు. ఎంతో తేజోవంతంగా మనోహరంగా కనిపిస్తోంది దానిని కాగితం మీదకు తీసుకు వచ్చే సరికి 80 శాతం మాత్రమే తయారవుతుంది. తానే అనుకుని కూడా తాను చేయలేని అసమర్థ కాదు ప్రపంచంలో ఎవరైనా అంతే అంటాడాయన. మనిషికి జ్ఞానం ఉంటే చాలదు దానికి విజ్ఞానం తోడవ్వాలి పుస్తకాలు చదివినంత మాత్రాన జీవితం అర్థం కాదు అనుభవ జ్ఞానం కూడా దానికి తోడవ్వాలి. వీటన్నిటినీ మించి సృజన లేకపోయినట్లయితే మామూలు మనిషి గానే మిగిలిపోతాడు. పట్టుదల కలిగిన శివనాగిరెడ్డి గారు దీనికి ఉదాహరణ. భారత దేశ ప్రథమ పౌరుని నుంచి ప్రధానమంత్రి మోడీని రాష్ట్ర మంత్రివర్గంలో చాలా మందిని కలిసిన అనుభవం కలిగిన వాడు ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ స్థాయి కలిగిన వ్యక్తులకు మనం ఏ స్థాయిలో ఉండి ప్రవర్తించాలి అన్నది ఎవరో చెప్పితే రాదు మనలో ఉన్న సంస్కారాన్ని బట్టి అవి అలవడతాయి. ప్రతి ఒక్కరిలో పరిధి ఉంటుంది. కొంతమందిలో కొద్దిగా ఉంటుంది మరికొంతమందిలో ఎక్కువగా ఉంటుంది. ఎంత ప్రతిభ ఉన్నా వ్యుత్పత్తి లేకపోతే అది నిష్ప్రయోజనం. కొత్త విషయాన్ని కొత్తరకంగా చెప్పగలిగితే దానిని సృజన అంటున్నారు. ఆ సృజన కలిగిన అతి తక్కువ మందిలో ప్రథములు మా శివనాగిరెడ్డి మహాశయులు.
గొప్ప స్థపతి మా శివ నాగిరెడ్డి గారు(37);-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి