మన చదువులు నలుగురికి ఉపయోగపడితే అంతకు మించిన సంతృప్తి మరొకటి ఉండదు అన్నది వాస్తవం. నిజానికి నేను నా కవితలతో మీ అందరికీ పరిచయమైనప్పటికీ, ఇప్పుడు ప్రస్తుతానికి నా ప్రవృత్తిని పక్కన పెట్టి వృత్తి ధర్మమైన పేషంట్ సర్వీసింగ్ లో భాగంగా
మిమ్మల్ని అప్రమత్తం చేసే బాధ్యతను తీసుకుంటున్నాను.
మెడికల్ టెర్మినాలజీ అనేది అందరికీ అర్థం కాదు అన్నది వాస్తవం. అయితే గూగుల్ టెక్నాలజీ బాగా పెరిగాక ప్రతి ఒక్కరూ డాక్టర్లు అయిపోయారు అనుకోండి....!
సరే సరే ఇక విషయానికొద్దాం....
లైఫ్ స్టైల్ డిసీజెస్ వీటి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?? ఇవేమీ కొత్త రకమైన జబ్బులు ఏమి కావు. మనం విన్నవే.... మనం అనుభవిస్తున్నవే....
అవును మన తాత ముత్తాతలు, జేజమ్మలు ఎంతో సత్తువతో జీవించి, చివరి రోజుల్లో కూడా వారి పనులను ఎవరి సాయం లేకుండా వారే చేసుకుంటూ జీవించారు. కానీ ఇప్పుడు అలా కాదు, కారణాలు వెతికితే సవాలక్ష దొరుకుతాయి కానీ, ప్రముఖంగా చెప్పుకొని తీరాల్సింది మాత్రం
ఆహారపు అలవాట్లు, వ్యవహారపు తీరు. "వాట్ ఇస్ మెంట్ బై లైఫ్ స్టైల్ డిసీజెస్???"
జీవనశైలిలో భాగంగా వృద్ధి చెందే వ్యాధులను "Life style diseases" అంటారు. రక్త పోటు (hypertension), మధుమేహం ( diabetes), ఊబకాయం (obesity), పిసిఓడి, డిప్రెషన్, ఎముకల కీళ్ళ సమస్యలు (gout, osteoporosis), క్యాన్సర్, గర్భం దాల్చలేక పోవడం (infertility) లాంటివి మరెన్నో ఈ కోవలోకి వస్తాయి. అసలు కారణాలేమిటో లోతుగా అధ్యయనం చేసి తెలుసుకుందాం... మొదటిది టీవీలు మొబైల్ ఫోన్ లను చూస్తూ పరిమితులు లేకుండా ఎక్కువగా తినడం, జంక్ ఫుడ్స్ కి అలవాటు పడడం,
ఫ్యాట్స్, ఆయిల్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవడం, బాడీని తగినంత ఫ్లూయిడ్స్ తో హైడ్రేట్ చేయకపోవడం, వ్యాయామాలు చేయకపోవడం, ఎక్కువసేపు లాప్టాప్ ముందర కూర్చోవడం (occupational demanding), మందు, సిగరెట్లను తాగడం, మాదకద్రవ్యాలను సేవించడం ఇవన్నీ మనకు అనారోగ్యాన్ని కలిగించేవే. రోజులలా మారిపోయాయి అందరూ సెటెంటరీ లైఫ్ స్టైల్ ను అలవాటు చేసుకోవాల్సిందే లేకపోతే చాలా కష్టం అని సమర్థించే వాళ్ళు లేకపోలేదు.
చెప్పడం తేలికే చేసి చూపడమే కష్టం అంటూ నన్ను తిడుతున్నారా ఏంటి...!
బుద్ధ భగవానుడు చెప్పిన ఒక వాక్యాన్ని చెప్తాను "Every Human being is the author of his own health or disease" మన అనారోగ్యానికి కారకులం మనమే అని. ఒక్కసారి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నవి మనలో మొదలయ్యాక వాటిని కంట్రోల్ చేయడం అంటే అంత సులభం ఏమీ కాదు జీవితాంతం మందులను సేవించాల్సిన పరిస్థితులు.
భయపడకండి... "ప్రివెన్షన్ ఇస్ బెటర్ దేన్ క్యూర్" అవును నిజమే ఇదంతా విన్నాక కాస్తంత కంగారు సహజం. అయినా వీటికి కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయి. అవే "లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్"
పొరపాట్లను సరిదిద్దుకుంటూ అలవాట్లను మెల్లగా మార్చుకుంటూ, తగిన అప్రమత్తతతో వ్యవహరిస్తే ఇలాంటి వాటి నుంచి సులభంగా తప్పించుకోగలం. నివారణ మార్గాలు ఇవే...
1)జంక్ ఫుడ్స్ ని బహిష్కరించాలి.
2)ఐదు నుంచి ఆరు లీటర్ల వాటర్ ను త్రాగాలి.
3)ఆహారానికి తగ్గట్టుగా వ్యాయామాన్ని శరీరానికి అందించాలి.
4)తగినంత నిద్ర అవసరం.
ఆకుకూరలు, పండ్లు కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
5)పాలు, గుడ్లు లాంటివి సేవించాలి.
6)మద్యానికి, సిగరెట్లకి దూరంగా ఉండాలి.
7)స్ట్రెస్ తగ్గించు కోవడానికి యోగ, మెడిటేషన్ లాంటి పద్ధతులను అలవరుచుకోవాలి.
ఆహార నియమాలను పాటిస్తూ, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ వుంటే ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి దరి చేరవు. ఒక్కొక్క వ్యాధికి సంబంధించిన జాగ్రత్తలను గురించి వివరంగా తెలుసకుందాం రేపటి భాగంలో మరొకటి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి