ఒబేసిటీ;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా ఆడ మగ అన్న తేడా లేకుండా అందరినీ పట్టి పీడిస్తున్న సమస్య ఒక్కటే అదే ఒబేసిటీ.
దీనికి కారణం ప్రతి ఒక్కరికి తెలిసినదే అదే ఆహారపు అలవాట్లు. శరీరంలో లిపిడ్ లె వల్స్ బాగా పెరిగిపోవడాన్ని హైపర్ లిపిడిమియా అంటారు.
ఒబెసిటీ రావడానికి ముఖ్య కారణం ఇదే. బాడీలో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేవి వుంటాయి. గుడ్ కొలెస్ట్రాల్ అనేది మనకు మేలు చేస్తే, బ్యాడ్ కొలెస్ట్రాల్ మనకు కీడు చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువ పెరిగిపోవడాన్ని
హైపర్ కొలెస్టెరోలేమియా అంటారు. అయితే ఈ ఒబేసిటీ జంక్ ఫుడ్స్, ఆయిల్ పదార్థాలను తినడం వల్ల వస్తుంది.
ఆహారపు అలవాట్లు మారిపోయాడం వల్ల, శారీరక
శ్రమ అనేది తగ్గడం వల్లనే ఈ బాధలన్నీ కూడా. బరువు బాగా పెరిగిపోవడం, ఆయాసం, అలుపు రావడం, బాడీలో యాక్టివ్ నెస్ తగ్గిపోవడం అనేవి దీని లక్షణాలు. అయితే ఈ సమస్యకు మందులయితే ఉన్నాయి కానీ కేవలం మందుల తోనే ఈ సమస్య పరిష్కారం కాదు. అయితే ఏం చేయాలి? జాగ్రత్త పడాలి, ఆహారపు అలవాట్లను ఆరోగ్యకరంగా మార్చుకోవాలి. వంట నూనెలను, నేతిని తక్కువగా వాడి, ఉడక బెట్టిన ఆహారాన్ని ఎక్కువగా సేవించాలి, కోడిగుడ్డులోని పచ్చ సొనని సాధ్యమైనంతవరకు తినకూడదు, కేకులు, మటన్ రొయ్యలను, ఊరగాయలను  నిషేధించాలి. స్కిన్ లెస్ చికెన్ ని మాత్రమే తినాలి, పాలను తాగవచ్చు కానీ వెన్న, నెయ్యి జోలికి వెళ్లకూడదు. 
మెంతులు అనేవి కొలెస్ట్రాల్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. రోజుకు 15 గ్రాముల మెంతులను తీసుకుంటూ, రెండు స్పూన్ల అవిసె గింజలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు జరుగుతుంది.
హెచ్చరికలు జారీ చేయడం అనేదే నా వంతు అది పాటించడం పాటించకపోవడం అనేది మీ ఇష్టానుసారం...
బాధ్యతగా ఈ చిన్ని డాక్టరు చెప్పిన మాటలను బుద్ధిగా వింటారని భావిస్తూ...


కామెంట్‌లు