ఆరోగ్యమే మహాభాగ్యము అన్న సూక్తి ప్రతి ఒక్కరు వినే ఉంటారు. మన సంప్రదాయాలలో అన్నీ ఆరోగ్యాన్ని పెంచేవే తప్ప తుంచేవి ఏవీ ఉండవు ఆంధ్ర దేశంలో ఎక్కడ ఏ పండగ ఎవరు చేసినా ఉదయాన్నే లేవడం, తలంటు స్నానం చేయడం ఏ పండగ చేయదలుచుకున్నారో ఆ పండగకు సంబంధించిన వస్తువులన్నీటిని సేకరించి పెట్టడం. ప్రత్యేకించి ఈ ఉత్సుకత పిల్లలలో ఎక్కువగా ఉంటుంది. త్వరగా లేచే పిల్లలు ఎక్కువ హుషారుగా ఉంటారు అని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉంటారు. పడుకునేటప్పుడు త్వరగా పడుకో లేచేటప్పుడు తొందరగానే లేవాలి అని పిల్లలకు నీతి బోధ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఆ రోజంతా ఎంత హుషారుగా ఉంటుందో అది అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. పిల్లల్ని అలా తయారు చేయాలి ముందు మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. పూర్వం రాణివాసంలో మహారాణులు చేసే తలంటుని అభ్యంగన స్నానము అనేవారు. ప్రతి అంగాన్ని శుభ్రము చేయడాన్ని అలా పిలుస్తారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ చేస్తున్నారు దీనివలన జరిగేదేమిటి పిల్లలకు చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి శరీరం మీద ఎలాంటి రోగకారక క్రిములు వున్నా నశించి పోతాయి. సామాన్యంగా చంటి పిల్లల్ని తల్లి నిత్యం స్నానాది కాలతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. మూడవ సంవత్సరం, నాలుగో సంవత్సరం వచ్చిన తర్వాత పిల్లలు గారాబంగా నువ్వేం చేయించనవసరం లేదు నేనే చేస్తానని శరీరం మొత్తాన్ని తడిపేయడమే స్థానం అనుకుంటున్నాడు. దానివల్ల స్నానం చేసిన అనుభూతి వస్తుంది తప్ప స్నానం చేయడం వల్ల కలిగే శరీరంలో వచ్చే మార్పులు అతనికి తెలియదు. కనుక స్నానం ఎలా చేయాలో తల్లి నేర్పాలి పిల్లలు బడికి వెళ్లి బాగా ఆడుకొని అలిసిపోయి చెమటతో లోపలికి వచ్చి బూట్లు బట్టలు విప్పటం మనం గమనిస్తాం కానీ మీరు అనేక చోట్ల తిరిగి వచ్చారు బూట్ల నిండా మట్టి ఉంటుంది ఎన్నో చెడు క్రిములు ఉంటాయి వాటితో లోపలికి రాకండి బయట విడిచి లోపలికి వచ్చిన తర్వాత కాళ్ళు కడిగి ఆ తర్వాత మీ పనులు చేసుకోండి అని చెబితే వాడు తప్పకుండా అలాగే చేస్తారు. దీనివల్ల క్రమశిక్షణ అలవాటవుతుంది ఆరోగ్యము బాగుపడుతుంది అలాంటి విషయాలు అన్నీ వాళ్లకు తెలిసేలా చెప్పాలి. అమ్మ చెప్పిన పని చేయని మూర్ఖులు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు అని నా అభిప్రాయం అందుకు మీరంతా నాతో ఏకీభవిస్తారని మంచి అమ్మలా ప్రవర్తిస్తారని అనుకుంటున్నాను.
అభ్యంగన స్నానం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి