పిల్లల ఆటలు చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది. ఒక్కోసారి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అన్న అనుమానం కూడా వస్తూ ఉంటుంది. అవతల ప్రత్యర్థిని ఓడించడానికి ఎత్తులు చిత్తులు వేయడం ఒకడికి బాగా అలవాటవుతుంది దాన్ని చూసి మిగిలిన వాళ్ళు ఓర్చ లేరు దాంతో తగాదాలు కొట్లాటలు ఒకరిపై ఒకరు లేనిపోనివి చెప్పుకుంటారు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అది పెద్ద వాళ్ళ చేతుల్లో ఉంటుంది ప్రత్యేకించి అమ్మలో తప్పు చేసినవాడికి తల్లి అతనిని కూర్చోబెట్టి అసలు విషయం ఏమిటని ఆరా తీస్తే వాడు ఉన్న విషయం బయట పెడు తాడు దానిని ఆధారం చేసుకుని అలాంటి పరిస్థితులలో పిల్లల పద్ధతి ఎలా ఉండాలి తగాదాలు లేకుండా ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో అమ్మ వారికి చెప్పాలి. ప్రత్యేకించి అమ్మ పేరు ఎందుకు చెప్తున్నానంటే పిల్లలను సముదాయించి బుజ్జగిస్తూ చెప్పే నేర్పు ఆమె వద్దనే ఉంటుంది అమ్మ ఏ పద్ధతిలో చెప్పినా దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు అందులో అమ్మ చెప్పే విషయం చాలా తార్కికంగా చెప్పవలసిన పద్ధతిలో వాడికి అర్థమయ్యేలా చెప్పగలిగిన పద్ధతి అమ్మ కు మాత్రమే తెలుసు. అతను అలా చేసినప్పుడు అలా చేయడం తప్పు కదా అలా ఆడ వచ్చునా? మనం ఆడుకునేది స్నేహాన్ని పెంచుకోవడానికి తప్ప మైత్రిని తెంచుకోవడానికి కాదు కదా మళ్లీ రేపు మనం మామూలుగా ఆడుకోవాలి కదా అంటూ అతనిని సముదాయిస్తూ మాట్లాడి అవతల వాడు మాత్రం ఏమిటి మనకేమైనా శత్రువా నీ ఆటలు మొత్తం అయిన తర్వాత అలాగేరా తప్పకుండా అలాగే చేద్దాం ఇక నుంచి ఇలా తప్పు పద్ధతులు నేను చేయను అని అతనికి చెబుతాడు. అమ్మ మెత్తగా చెప్పితే వినని కొడుకు ఎవడైనా ఉంటాడా అందుకే ప్రతిసారీ నేను చెబుతున్నాను పిల్లలు ఏ పని చేస్తూ ఉన్నా ఒక కన్ను వారిపైనే ఉంచండి సక్రమమైన పద్ధతిలో ఆడుకుంటూ ఉంటే మీరేమీ కలగ చేసుకొనవవసరం లేదు ఎప్పుడు ఆ క్రమం తప్పుతుందో అప్పుడు మీ అవసరం వాళ్లకు ఉంటుంది దాన్ని మరిచిపోవద్దు. పిల్లలను అల్లరి వాడిగా చేసిన బుద్ధిమంతుడుగా తీర్చిదిద్దినా మన వల్లనే అవుతుంది తప్ప మరొకరి వల్ల కాదు. ఇది అమ్మ బాధ్యతా అని అడిగితే సమాధానం చెప్పలేను కానీ హక్కు తో కూడిన బాధ్యత అని మాత్రం ఘంటాపధంగా చెప్పగలను. పిల్లలను గొప్పవారిని చేయడం అనే హక్కు కదా వాడిని తీర్చిదిద్దడం. నీ బాధ్యత కింద కు రాదా మీరు ఆలోచించండి. ఏదో చిన్న కథ చెప్తుంది కదా అని నిర్లక్ష్యం చేయకండి ఆలోచించి చేయండి పిల్లల మానసిక స్థితి బాగుచేయడమే అన్నది జ్ఞాపకం పెట్టుకోండి చాలు.
పిల్లలలో మార్పు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి