తల్లి లాలింపు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 సమాజంలో అందరూ ఒక మాదిరిగా ఉండడం  అసహజం పుర్రెకో బుద్ధి అన్నారు పెద్దలు ఒకరికి వచ్చిన ఆలోచన మరొకరికి రాకపోవచ్చు. ఒకరు దృష్టి మరొకరికి తెలియదు. ఒక్కొక్కరికి ఒక పని చేయడంలో చాకచక్యం ఉంటుంది. ఎంత త్వరగా చేద్దామన్నా మిగిలిన వాళ్లకు సాధ్యం కాదు అలాగే సమాజంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు  ఉన్న వాళ్ళు మాత్రమే మంచి చేస్తారని లేని వాళ్ళు ఎప్పుడు తప్పులు చేస్తారని అనుకోవడం భ్రమ. మానసికంగా ఆలోచించినా లేనివాడు దొరికినప్పుడు  ఉన్నవాడు అరిగినప్పుడు  అని మన పెద్దలు చెబుతారు. ఆకలితో నకనకలాడే వాడికి ఒక్క ముద్ద అన్నం దొరికినా వాడికి పాయసం లాగా ఉంటుంది  అది ఉన్న వాడికి పెడితే పాయసం కూడా  అసహ్యంగా కనిపిస్తోంది  సమాజంలో ఇలాంటి వాళ్ళను చాలా మందిని మనం గమనిస్తూనే ఉంటాం.
పురుషుల ఆధ్వర్యంలో  యజ్ఞము యాగము క్రతువు లాంటివి జరుగుతూనే ఉంటాయి. దాని నిర్వహణ వ్యయ ప్రయాసలతో కూడినది ఎంతో ఓపిక ఉండాలి  అలాంటి ఓపిక ప్రపంచం మొత్తం మీద అమ్మకు ఒక్కదానికే ఇచ్చాడు భగవంతుడు ఒక బిడ్డకు భోజనం పెట్టాలి అంటే  మహా పురుషుల యజ్ఞం కన్నా ఇది గొప్ప యజ్ఞం. దానిని తల్లి మాత్రమే నిర్వహించగలదు బిడ్డకు ఆటలంటే ఇష్టం  ఆ ఆనందంలో వాడికి ఆకలి కూడా తెలియదు. ఆటలో ఆకలి తెలిసినా ఎవరూ పట్టించుకోరు. అమ్మ అక్కడి నుంచి వాడిని ఆటోలో లోపలికి తీసుకురావడానికి అరగంట పడుతుంది. వచ్చిన తర్వాత వాడిని శుభ్రం చేసి పీటల మీద కూర్చో బెట్టడం జరుగుతుంది. అప్పటికే సగం ఓపిక నశించి పోతుంది  ఆ సంగతి వారికి తెలియనివ్వదు అమ్మ.
తర్వాత అన్నాన్ని నేతితో కలిపి గోరుముద్ద తినిపించే వయసు దాటి వచ్చాడాకుర్రవాడు వాడి కడుపు నింపడానికి ఈమె ఎన్ని బాధలు పడుతుందో చెప్పలేం . ఏది పెడితే అది తప్ప మిగిలింది కావాలంటాడు  వాడిని మాయ చేయడానికి  ఏవో తాయిలాలు ఇవ్వాలి  వాడు ఆటలు ఆడుకోవడానికి అనుమతివ్వాలి. నాకు నువ్వు తినిపిస్తే నేను తింటాను లేకపోతే నేను తినను అని మారాం చేస్తే ఆమె కలిపి ముద్దలు పెట్టాలి వాడి మనసంతా ఆటల మీద ఉంటుంది ఎంత త్వరగా తిని  బయటకు వెళ్లి ఆడదామా అనుకుంటాడు.  నమలకుండా గబగబా తినడానికి ప్రయత్నం చేస్తాడు అక్కడ అమ్మ పాత్ర ప్రాధాన్యత తినిపించడం కాదు ముఖ్యం అనే పద్ధతిని చెప్పాలి.  ఎంత కష్టతరమైన పనో ఒక్కసారి ఆలోచించండి మీకే తెలుస్తోంది.ముద్దు గా చెప్పాలి వాడికి కోపం రాకుండా చెప్పాలి అది కాదు నాన్నా బాగా నమలాలి  ఆ తర్వాత తినాలి  ప్రతి మెతుకు ముక్కలు ముక్కలై లాలాజలం తో కలిస్తే తప్ప జీర్ణక్రియ సక్రమంగా సాగదు అని వైద్యులు అంటారు  అన్నం జీర్ణం కావడానికి సగం ప్రయత్నం నోరు ఇది ఇంకా లాలాజలంతో బాగా కలిసేట్టు నమిలి పదార్థం కడుపులోకి చేరిన తరువాత చక్కగా జీర్ణమై  ఏ పాళ్ళలో  ఆ ముద్ద రక్తంగా మారాలో అలా మారి  నరాల ద్వారా శరీరం మొత్తం వ్యాపిస్తుంది. ఈ శాస్త్రీయమైన విషయాన్ని  వాడికి అర్థమయ్యే మాటల్లో చెప్పాలి  అది అమ్మకు తప్ప మరెవరికీ సాధ్యమయ్యే విషయం కాదు  దానికి కారణం వాడు ఏ క్షణాన ఎలా మాట్లాడుతాడో, ఎలా ప్రవర్తిస్తాడో ఆమెకు తప్ప మిగిలిన వారికి ఎవరికీ తెలియదు కనుక ప్రతి తల్లి ఆ జాగ్రత్త తీసుకుంటే ప్రతి బిడ్డ ఆరోగ్యవంతంగా పెరుగుతాడు కనుక ప్రతి తల్లి దీనిని పాటిస్తే  మంచి భావి భారత పౌరుల్ని  దేశానికి అందించిన తల్లి అవుతుంది. మరి అందిస్తారు కదా...?


కామెంట్‌లు