పిల్లల ఆటలలో పెద్దలు ముందే ఊహించి తగిన జాగ్రత్తలను చెపితే, మీరు దీనిని ఆటగా తీసుకోవాలి, ఒకరిమీద ఒకరు కోపంతో కక్షతో కసి తీర్చుకోవడం కోసం చేయకూడదు. మీరు ఏ ఆటాడిన స్నేహితులు లాగా ఒక కుటుంబసభ్యులు లాగా ఉండాలి తప్ప వాడు నాకు ప్రత్యర్థి అన్న కసితో ఆడకూడదు. అవతల వాడు చాలా బాగా పరిగెడుతుంటే వారిని మించిన వేగంతో పరుగిడడానికి ప్రయత్నం చేయాలి తప్ప వాడి వేగాన్ని అడ్డగించి ప్రమాదాలకులోను కాకూడదు అని ముందే అన్నీ కూలంకషంగా చెబితే ఆ వయసులో ప్రతి కుర్రవాడు తప్పకుండా వింటాడు. అలా వారిలో స్నేహ భావం పెరుగుతుంది. మరొక ప్రాంతం నుంచివచ్చే ప్రత్యర్థులతో పోటీపడి వీరంతా సమైక్యంగా కలిసిమెలిసి ఆడితే వాళ్లపై విజయాన్ని సాధిస్తారు. అలాంటి సమయంలో వారిని ఉత్సాహపరచి చిన్న చిన్న బహుమతులు, చాక్లెట్లు, బిస్కెట్లు రబ్బర్లు, పెన్సిల్ కానీ ఇస్తే వాడు ఇంకా ఉత్సాహంతో పని చేసి మనందరినీ ఆనందాన్ని కలిగిస్తారు ఆరోగ్యంగా పెరుగుతారు ఆకలి పెరుగుతుంది పండుకున్న వెంటనే నిద్ర వస్తుంది కనుక మనం మన పద్దతులు మార్చుకుంటే పిల్లలు ఉత్తమంగా తయారవుతారు అని నా నమ్మకం. పిల్లలు రకరకాల అభిరుచి కలిగిన వాళ్ళు ఉంటారు ఒకడు క్రికెట్ ఆడుదామంటే మరొకడు టెన్నిస్ కోర్టుకు తీసుకెళ్తాడు ఇంకొకడు చెడుగుడు అంటాడు మరొకడు కబాడీ అంటారు. ఇద్దరు ముగ్గురు కలిసి కొక్కో అంటారు ఒక్కడు ఒకే సమయంలో ఎన్ని ఆటలు ఆడగలడు. అందువల్ల ఎక్కువమంది ఏ ఆటలు అని అనుకుంటే దాని మీద మక్కువ పెంచుకుని ఆడడం మంచి లక్షణం మా సాయి వేమన్ పరుగులో గాని, క్రికెట్ లో గాని ప్రథములు ఆ రెండు తప్ప మిగిలిన వాటికి ప్రాధాన్యతను ఇవ్వడు. అలా కాకుండా తన అభిరుచి ఏ ఆట పై ఉన్నదో దానితో పాటు మిగిలిన ఆటలను గురించి కూడా తెలుసుకొని దానిలో తనకు ఏది నచ్చితే దానిలో పాల్గొనాలి. ప్రతి ఆటలోనూ తప్పనిసరిగా ఒక ప్రయోజనం ఉంటుంది ఒక్కొక ఆట ఒక రకంగా ఒక్కొక్క ప్రయోజనంతో ముడిపడి ఉంటుంది. కనుక అన్నీ నేర్చుకోవాలి.
భిన్న ఆటల అభిరుచి;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి