స్వతంత్ర భారతం;-డాక్టర్ ఎం. ఎన్. బృంద;-చరవాణి సంఖ్య: 7013210398

ప్రక్రియ : సున్నితం
================
పోర్చుగీసుపై  అబ్బక్కరాణి  పోరాటం
మణికర్ణిక  వీరోచిత  రాజమకుటం
భగత్సింగ్  తూటాల  అపూర్వఘట్టం
చూడచక్కని తెలుగు సున్నితంబు!

కలకత్తాలో గుప్తాత్రయం ఆత్మస్థైర్యం
నేతాజీ  ఆజాద్హింద్ఫౌజ్  నేతృత్వం
మన్నెందొర  కట్టబ్రహ్మనల  దాతృత్వం
చూడచక్కని తెలుగు సున్నితంబు!

మహనీయుల  మారణహోమాల  ఫలితం
భిన్నత్వంలో  ఏకత్వం  మనదేశం
సర్వసత్తాక  ప్రజాస్వామ్య  గణతంత్రరాజ్యం
చూడచక్కని తెలుగు సున్నితంబు!

స్వతంత్ర  సముపార్జన  స్వాధికారం
నేటికీ   పేదవారిబ్రతుకుల్లో అంధకారం
ముందడుగుతో  ప్రభుత్వాల  సహకారం
చూడచక్కని తెలుగు సున్నితంబు!

సమరయోధుల శంఖారావం ప్రజ్వరిల్లాలి 
భావిభారతపౌరుల ఆలోచనల్లో మెదలాలి
వసుదైకకుటుంబాన్ని అందరం ఆహ్వానించాలి
చూడచక్కని తెలుగు సున్నితంబు!

కామెంట్‌లు