స్వతంత్ర భారతం ;-ఉమామహేశ్వరి యాళ్ళ ;-చరవాణి:7032216995
ప్రక్రియ: సున్నితం
===============
సంపద చూసి మోజుపడి
వర్తకమని అనుమతి అడిగి
ప్రవేసించిరి మేకవన్నె పులులుగ
చూడచక్కని తెలుగు సున్నితంబు!
         
సంపద తరలించగ యెంచిరి
మనని బానిసలుగ చేసిరి
పన్నులు విధించి బాధించిరి
చూడచక్కని తెలుగు సున్నితంబు!
       
విభజించు పాలించు అంటిరి
మనలో మనకి తంపులెట్టిరి
ఐకమత్యము చెరపగ చూసిరి
చూడచక్కని తెలుగు సున్నితంబు!
          
సత్యాహింసల బాటగ వేసి
గాంధీజీ నెరపిరి ఉద్యమము
భారతీయతను తిరిగి పొందగ
చూడచక్కని తెలుగు సున్నితంబు! 

ఆడ మగా అంతాకలసి
స్వరాజ్యమే జన్మ హక్కని
ఎదురుతిరిగి పోరాటం సల్పిరి
చూడచక్కని తెలుగు సున్నితంబు!

కామెంట్‌లు