స్వాతంత్ర్య భారతం;-శిరీష వూటూరి;-సెల్ నంబర్:8008811669
ప్రక్రియ:సున్నితం
=============
ఎందరో వీరుల త్యాగఫలం
మరెందరో శూరుల ప్రాణార్పణం
మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం
చూడ చక్కని తెలుగు సున్నితంబు

ఒకరిది సత్యం ,అహింసా వాదం
మరొకరిది విప్లవం,ఎదురించే నైజం
ఏకమై తెల్లదొరలను ఎదురుంచిన వైనం
చూడ చక్కని తెలుగు సున్నితంబు

కులములంటు కుమ్ములాటలు వద్దు
మతములంటు మచ్చ తేవద్దు
మన ఐక్యత భారతావనికి ముద్దు
చూడ చక్కని తెలుగు సున్నితంబు

కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా
ఎల్లలు లేని ప్రేమను పంచుదాం 
మనకీర్తి పతాకాన్ని గర్వంగా ఎగిరేద్దాం
చూడ చక్కని తెలుగు సున్నితంబు

పుణ్యభూమి నా దేశం నా గర్వం
ఢిల్లీ ఎర్రకోటపై రెపరెపలాడుతున్న
మనజెండా సాక్షిగా వందేభారతం
చూడ చక్కని తెలుగు సున్నితంబు


కామెంట్‌లు