ప్రక్రియ : సున్నితం .
రుాపకర్త : శ్రీ నెల్లుట్ల సునీతగారు.
==========================
స్వాతంత్రోద్యమాల శాంతి పోరాటం
దేశభక్తి నిండిన నినాదాలతో
బానిసత్వ సంకెళ్ళకు స్వస్తివాదం
చుాడ చకచకని తెలుగు సున్నితంబు ॥
భారత దేశ విముక్తికై
పోరాడిన విప్లవ వీరులనేకం .
సత్యాగ్రహాల బాటలో యువతరం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
అహింసయే ఆయుధమైన పోరాటం
ద్దరిల్లిన నిజాం నిరంకుశత్వం
విప్లవనాదాలతో బ్రిటిష్ పాలనాంతం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
స్వాతంత్రోద్యమంలో ఉద్యమ వీరులర్పించిన
ప్రాణత్యాగాల ఫల స్వరుాపం.
నేటిమన స్వాతంత్ర్య భారతదేశం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
కులమతాలులేని స్వాతంత్ర్యం భారతదేశం
శాంతి సత్యహింసలకు సాక్షిభుాతం
ఎగురుతున్న మువ్వన్నెల విజయపతాకం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి