సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ....సున్నితం
రూపకర్త.... నెల్లుట్ల సునీత గారు
=========================
సునీతమ్మ రూపొందించినదీ సున్నితము
కవులెందరినో ప్రోత్సహిస్తూ ప్రతిదినము
విశ్లేషణలు చేస్తుంటారు అనుదినము
చూడచక్కని తెలుగు సున్నితంబు
ద్వివసంతము పూర్తయ్యి మరు వత్సరానికి
తననితాను దిద్దుకుంటూ ఇంకొంచెంముందుకి
పరుగులిడుతున్న సున్నితానికి శుభాకాంక్షలు
చూడచక్కని తెలుగు సున్నితంబు
మూడు పదములు ఒకవరుసగా
మూడు పాదములు అర్ఢవంతముగ
సున్నితంబు మకుటమై విలసిల్లుచును
చూడచక్కని తెలుగు సున్నితంబు
వారమునకు ఒక్కో అంశము
దేనికదే అత్యంత భిన్నము
ప్రతీకవిలో రాయాలనే ఉత్సాహము
చూడచక్కని తెలుగు సున్నితంబు
సున్నితానికి జన్మదిన శుభాకాంక్షలు
నిండునూరేళ్ళు కొనసాగాలి ఈసున్నితాలు
మేల్కొల్పాలి జనహృదిని ఈఅంశములు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి