ఒక రహస్యం;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

 (ఆఫ్రికన్ స్త్రీ కవితా శిరోమణి జెనీ కౌజిన్ కవితకు స్వేచ్ఛానువాదం)
మొదట నేను ఒక్కణ్ణే తరువాత ఇద్దరం
మరలా ఒకడిగా మిగిలాను!
ఎందుకంటే ఆమె నాలో సగభాగం!
నా ప్రేమలో సగభాగం అయిపోయింది!
                   ఆమె
                   *****
నా కడుపులో పెరుగుతున్న బుజ్జిగాడు
ముద్దుగా తన కాళ్ళతో నాడుపులోపల తంతున్నాడు!
 ఓ విత్తనం మొలకెత్తి చేతులు,కాళ్ళు,
ఒక హృదయం సంతరించుకుని చిత్రంగా
జీవితాన్ని సృష్టించు కుంటున్నాడు
నాకు అర్థమయింది నేను ఒక్కతినే కాను...
ఒక్కరికంటే ఎక్కువే!
ఇదంతా ఆ విధాత సృష్టించిన ప్రపంచం- ఇదే
ఆయన ప్రపంచం
ఎప్పటికీ నిలిచిపోయే ప్రపంచం!
                   ******     ******

కామెంట్‌లు