ఎండకు మండిన హృదయంలో మంటలు
చెలారేగు తుంటే
తుంటరి తనంతో ఆకాశం పకపకలతో
రవ్వంత జల్లులు, జల్లుల రవ్వలు
చినుకు, చినుకులా జారి జారి పడుతుంటే
తొట్ట తొలుత ముఖం చూపిన
మువ్వాకు గతుక్కుమంది అమాయకత్వం తో
తుంటరి తనం గిలిగింతలు, కవ్వింతలు కలుగ,
వలదన్నది వయస్సు మళ్ళిన మారాకు
కొద్దిక్షణములు , ఈ ఆనందం. కొత్తదనం
అనుభవిoచావంటే, నీకే తెలిసి వస్తుంది
నిజం,
ప్రతీ వృక్షం, ప్రతీ మాను, ప్రతీ గుబురు,
ఒక్కటేమిటి. ప్రతీ ఒక్క పచ్చనాకు
వాన పరిష్వoగంలో మురిసిపోతున్నాయి
ముద్దుల బిడ్డలలా అలరిస్తున్నాయి చినుకులు
వివిధ అలంకారాలతో, ఎంత అందం
ఎంత బిగి, ఏ మహానుభావుడి దీవనలో
ఆనందం తో ప్రకృతి పులకరించి విన్యాసం
చేస్తూ ఉంటే రవలించే నాదంతో రసవంత
మైన భావం తో ,సన్నని సన్నాయి రాగం లా
గాలి ఈల వేస్తూవుంటే ఏమనే భావన
రాక ముందే తనను తాను మరచిన
ఉదయం వరిగి పోయింది అలసటగా
చిక్కటి ముసుగులోకి. కొప్పరపు తాయారు.
కొప్పరపు తాయారు
17_ 462 B3, N.V R .street,.
Nehru nagar,
మదనపల్లి,(అన్నమయ్య ,జిల్లా)
పిన్__517325.
వాన చినుకు;- కొప్పరపు తాయారు;-పోన్ _ 9440460797
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి