బాల పంచపదులు
==============
1. "ఓంకారాన్ని నేను",
గీతా వాక్యము!
అదే పరమాత్మ,
అక్షర రూపము!
తెలుసా ,
ఓంకారం, దైవం అభేదము!
అది మోక్షానికి ,
తెరిచే ద్వారము!
నిత్యం ప్రణవంతో,
ప్రణామం, రామా!
2." ఓం " వేయి అర్ధాల,
సమాహారం!
అందులో ఒకటి ,
దైవఆహ్వానం!
దైవనామం,
"ఓం" తో ప్రారంభం!
ఓంకారంతో ,
దైవం సాకారం!
నిత్యం ప్రణవంతో,
ప్రణామం, రామా!
3. ఓం అక్షరమే ఆ బ్రహ్మ!
తపస్సుకు మూలం అదేనమ్మ!
కలియుగాన అదే పట్టుకొమ్మ!
సార్థకం ఈ మానుష జన్మ !
నిత్యం ప్రణవంతో,
ప్రణామం, రామా!
4. ప్రణవనాద ప్రకంపనాలు!
మనసునకెంతో సాంత్వనాలు!
ఆధ్యాత్మిక జీవన సాధకాలు!
అద్వైతభావ సరిభోధకాలు!
నిత్యం ప్రణవంతో,
ప్రణామం, రామా!
5." ఓం" అను చాలు,
అదే పదివేలు !
బతుకు చక్కని,
పూలతేరు!
జీవితం సాగే,
సెలయేరు!
దైవసన్నిధి ,
తప్పక చేరి తీరు!
నిత్యం ప్రణవంతో,
ప్రణామం ,రామా!
_________
:ప్రణవంతో ప్రణామం;-డా. పి. వి. ఎల్. సుబ్బారావు.- 9441058797,
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి