"వీరోంకి వీరతా" కవితలతో వీరులకు జోహార్లు;-రాథోడ్ శ్రావణ్ ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా.9491467715
 దేశ రక్షణలో వీరుల సేవలు మరువలేనివి.వారి త్యాగాలు వర్ణించలేనిది.దేశం కోసం నిస్వార్థ భావంతో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీరులు  అటువంటి వీరులకు "వీరోంకి వీరతా" రచనతో వారి సేవలను కీర్తిస్తూ కవి, రచయిత, ఉపాధ్యాయుడు  
డా. జాధవ్. ఇందల్ సింగ్ బంజారా గారు సంకలనం రాసి ఆజాదీ కా అమృత మహోత్సవం సందర్భంగా అమర వీరులకు అక్షర నివాళి అర్పించడం సంతోషం.
డా.జాదవ్ ఇందల్ సింగ్ బంజారా గ్రామము మహాగామ్, మండలం నార్నూర్, జిల్లా ఆదిలాబాదులో  శ్రీమతి/శ్రీ,జాదవ్ వేంకట్ రామ్ మహారాజ్, యమునా బాయి దంపతులకు 15 ఆగస్టు1978 జెండా పండుగ రోజున జన్మించారు. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నార్నూర్ యందు చదివి, మాధ్యమిక విద్యా గురుకుల కళాశాల లాల్ టేక్డి ఉట్నూరు యందు అభ్యాసించారు.
గిరిరాజ్  ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిజామాబాదులో బి.ఏ ఉత్తీర్ణులైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదు నుండి  ఎమ్.ఏ హిందీ పూర్తి చేసారు.వీరి తండ్రి వేంకట్ రామ్ మహారాజ్ బంజారా సమాజానికి సంబంధించిన భజనలు, కీర్తనలు చేస్తూ సమాజాన్ని జాగృతం చేసేవారు.అతని తండ్రి ప్రభావంతో చిన్నప్పుడు నుంచి కవితలు రాయడం,పాటలు రాయడం పాడడం చేసేవారు.హిందీ సాహిత్యం మీద ఆశక్తితో ఆదిలాబాద్ జిల్లా బంజారా లోక్ కథ అనే అంశంపై కాకతీయ యూనివర్సిటీ నుండి ఎం.ఫీల్ పూర్తి చేశారు. బంజారా సంస్కృతి సాహిత్యం మీద పరిశోధన చేసి గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.
బంజారా లోక్ కథలు-2013 లో బంజారా సంస్కృతి సాహిత్యం-2015 లో
జీవనయానం కవిత సంపుటి తెలుగు భాషాలో రాసి- 2020లో ఆవిష్కరించారు. 2022లో వీరోంకి విరతా అనే కవితల సంకలనం హిందీలో రాసారు.ఇలా హిందీ, తెలుగు భాషల్లో రచనలు చేస్తూ సాహిత్యంలో రాణిస్తున్నారు.ఇప్పటి వరకు మూడు పుస్తకాల హిందీలో ఒక పుస్తకం తెలుగు భాషాలో మొత్తం నాలుగు పుస్తకాలు రాసి ఆవిష్కరించారు. జిల్లాలో బంజారా రచయితల వేదికను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్,తెలంగాణ కవుల ద్వారా ఐదు e-సంచికను విడుదల చేశారు. బంజారా సమాజంలో పుట్టడం వలన తన కలం పేరును 'బంజారా' అను పేరు పెట్టి తన పేరు పక్కన రాసుకోవడం జాతి పట్ల తనకున్న అభిమానం అని చెప్పవచ్చు. బంజారా సంస్కృతి పై స్వతగా రెండు పాటలు రాసి పాడడంతో పాటు బంజారా సాహిత్య కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించడం గర్వించదగ విషయం. విశిష్ట కవిరత్న, కళాత్మక బిరుదు, ఝాన్సీ లక్ష్మీబాయి పురస్కారం, బంజారా యూత్ ఐకాన్ అవార్డు అందుకున్నారు.
ఈ వీరోంకి వీరతా పుస్తకంలో మొత్తం ముప్పై ఏడు పాఠాల్లో ఎనిమిది పాఠాలు మాతృ భూమి మరియు వీరులను స్మరిస్తూ వారి పోరాట పటిమను గౌరవిస్తూ రాయడం అభినందనీయం. 
 భారత సరిహద్దుల్లో దేశం కోసం నిరంతరం సేవలందిస్తున్న వీరులు
తమ ప్రాణాలను లేక్క చేయకుండా దేశ రక్షణలో ధీరత్వాన్ని ప్రదర్శిస్తూ  ప్రాణాలర్పిస్తూన్న వీరుల శ్రమ, వారి త్యాగాలు ఎప్పటి వృధా కాదు అని అన్నారు.
భారతీయ సమాజంలో స్త్రీల పాత్ర పైన తిలక్ కవితలో స్త్రీల యొక్క ధైర్యం సాహసం, సమాజ నిర్మాణంలో స్త్రీల యొక్క పాత్ర, వారి గొప్పతనం గురించి చక్కగా వర్ణించారు. సృష్టికి మూలమైన స్త్రీ ఒక బిడ్డగా,చెల్లిగా, భార్యగా, తల్లిగా వివిధ పాత్రలో గౌరవం  పోందుతున్నారని అన్నారు.
"కలం కీ తాకత్" కవితలో కవి కలానికి ఉన్న శక్తి అపారమైనది. భూమి ఆకాశానికి కూడా కదిలించే అద్భుతమైన శక్తి కలములో ఉందని, కలంతో కవులు పలు సమస్యల పైన తమ యొక్క గళాన్ని వినిపిస్తున్నారని,
కవి కలము ఎప్పటికీ ‌లోంగదు అందుకే కత్తి కంటే కలం గొప్పదని కవి కలం గుర్చి గొప్పగా అన్నారు.  
"సాతీ" కవితలో వ్యవసాయం చేసి పంటలు పండించే రైతులు వారికి సహాయకారి ఉండే ఎడ్లుకు ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలుపుతు 
నా దుఃఖాన్ని పంచే  ఒకే ఒక్క మిత్రుడివి, కష్టాన్ని పాలుపంచుకునే సాహయకుడివి,నా బాగోగులు కోసం ఆలోచించే శ్రేయోభిలాషివి, నీవు లేక పొతే నా జీవితానికి అర్థమే లేదు. నీవు నాకే కాదు రైతులందరికీ గుండె చప్పుడువి అని కవి  అద్భుతంగా ఎద్దు, రైతుల సంభాషణను  వర్ణించారు.
"హిందీ హే హమ్" కవితలో కవి హిందీ భాషను ప్రశంసిస్తూ హిందీ భారతీయుల అధికారక భాష అని భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతున్న హిందీ మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రతి ఊరు వాడా నుండి పట్టణం, నగరాల్లో కూడా ప్రతి చోటా వినిపించే మధురమైన భాష హిందీ. భారతీయుల పరిచయాన్ని విశ్వంలో ఉన్న ప్రతి దేశానికీ
తెలియ పరిచే గోప్ప సాధనం హిందీ అని కొనియాడారు.
"దివాలీ" అనే కవితలో దీపావళి పర్వదినం సందర్భంగా మనం ఉపయోగించే విదేశీ వస్తువులను బహిష్కరించాలని స్వదేశీ వస్తువులను స్వీకరించాలనే  సందేశాన్ని తెలియజేశారు. దీపావళి పండుగ ప్రకృతితో ముడి పడి ఉంది.కనుక ప్రకృతిలో లభించే పూలు, పండ్లలతో పాటు పత్తి దూదితో తయారు చేసిన ఒత్తులు,మన భారత మట్టితో తయారు చేసిన దీపాలను  వెలిగించి, దేశంలో చైతన్య మైన జ్యోతిని వెలిగించి, భారత దేశం యొక్క గొప్పతనాన్ని, గౌరవాన్ని, స్వాభిమానాన్ని
 చాటి, దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని అన్నారు.
ఇలా అనేక అంశాలను కేంద్ర బిందువుగా తీసుకుని సరళమైన పదజాలంతో ఆకర్షణియంగా తన కవితలో వర్ణించడం ప్రశంసనీయం.

ఈ వీరోంకి కీ వీరతా పుస్తకంలో ముఖచిత్రంగా అన్నదాత  చిత్రపట్టాన్ని పెట్టి దేశానికి వెన్నెముక అయిన రైతుల కీర్తిని చాటారు.ఈ పుస్తకంలో మొత్తం 56 పుటాలతో ఆకర్షణీయంగా, అందంగా, పుస్తక పఠన అభిమానులను ఆశక్తి కలిగించే విధంగా కవి చక్కని భావుకత తో రుపొందించడం అభినందనీయం.
 
ప్రతులకు
డా. జాదవ్ ఇందల్ సింగ్ బంజారా
ఇం,నెంబర్, 3-36
సేవాదాస్ నగర్
ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా.
పేజీలు:-56 
వెల:-49/-


కామెంట్‌లు