స్వతంత్ర భారతం;-నరేందర్ రెడ్డి దన్నవరం;-చరవాణి: 9492002855
 ప్రక్రియ : సున్నితం 
================
ఉవ్వెత్తున ఎగసెను స్వాతంత్రోద్యమం
విప్లవ వీరుల బలిదానాలతో
మేధావుల ఉపన్యాస ప్రభావాలతో
చూడచక్కని తెలుగు! సున్నితంబు!!
 
సబ్బండ వర్ణాలు ఏకమయ్యే
స్వదేశీ సత్యాగ్రహ దీక్షలతో
శాంతి మంత్ర నినాదాలతో
చూడచక్కని తెలుగు! సున్నితంబు!!
 
అహింసయే ఆయుధమై గెలిచే
బానిస సంకెళ్లు తెంచగా
భారతికి హారతులు పట్టగా
చూడచక్కని తెలుగు! సున్నితంబు!!
  
శతాబ్దాల పోరాట ఫలితం
అమృతోత్సవ స్వాతంత్ర్య సంబరం
ఇంటింటిపై త్రివర్ణ కేతనం
చూడచక్కని తెలుగు! సున్నితంబు!!
నీతి నిజాయితీలే ఆలంబనగా
త్యాగమూరుల గాధలే స్ఫూర్తిగా
భారతిని నిలుపుదాం విశ్వగురువుగా
చూడచక్కని తెలుగు! సున్నితంబు!!

కామెంట్‌లు