పోలికలు చెప్పడంతో కవి మేధస్సు బయటపడుతోంది. సనాతన కవులలో అందరూ పద్య సాహిత్యం మీద దృష్టి పెట్టి సామాన్యులకు అర్థమై అర్థం కానటువంటి చక్కటి పోలికలను చెప్పేవారు. పోలిక అంటేనే కాళిదాసు గా గుర్తింపు ఉపమా కాళిదాసస్య అని కూడా అంటున్నారు అంత మహానుభావుడు సంస్కృతంలో చెప్పాడు. వేమన జీవితానుభవం తప్ప అక్షరాలు నేర్చుకున్న వాడు కాదు జీవితంలో ఉన్న భోగభాగ్యాలను అన్నిటినీ అనుభవించిన వాడు తప్ప సాహితీ వీధిలో విహరించిన వాడు కాదు అయినా వారి పద్యాలు సామాన్యుని నోటిలో కూడా ఆడుతున్నాయి అంటే వారి జీవిత అనుభవం మానవ మేధస్సును అర్థం చేసుకోవడంలో ఉన్న నిశిత పరిశీలన ఆయనను ప్రజాకవిగా నిలబెట్టాయి. ఏ పద్యం రాసినా దానిలో ఏదో నీతి సమాజానికి కొత్త విషయాన్ని చెప్పడం కనిపిస్తుంది. మనం రోజూ చూసేవి మనకు బాగా తెలిసిన విషయాలను కూడా తేట తెలుగులో మనసుకు హత్తుకునేలా మూడు పాదాల్లో జీవితమంతా గుర్తుండేలా రాశారు. ఆయన రైతు కుటుంబంలో పుట్టినా వ్యవసాయం చేసిన పాపాన పోలేదు, స్త్రీ సాంగత్యము వున్నా ఆజన్మ బ్రహ్మచారి ద్వైతాన్ని అద్వైతంలో చూసిన మహాయోగి ఎవరి దగ్గర ఎప్పుడో నేర్చుకున్న విషయాలు కావు. తన తపస్సు ద్వారా తన మేధస్సు ద్వారా తెలుసుకున్న విషయాలు కుటుంబం తెలియకుండా వ్యవసాయం తెలియకుండా ఈ రెంటినీ సమన్వయపరుస్తూ చక్కటి పోలికతో పద్యం చెప్పడం ప్రజాకవికే తెలుసు వ్యవసాయదారుని కష్టాలు తెలిసినవాడు. దుక్కి దున్నాలి, విత్తు చల్లాలి, నాటు పెట్టాలి, చీడ పీడలు తగలకుండా కాచి రక్షించుకోవాలి. అప్పుడు ధాన్యం ఇంటికి చేరుతుంది కుటుంబంలో స్త్రీ పురుషులు హాయిగా సంతోషంగా కాలం గడపాలి అంటే భార్యాభర్తలిద్దరూ స్వచ్ఛంగా ఉండాలి బిడ్డలు సమర్ధులై ఉండాలి అప్పుడు ఆ కుటుంబం అమందానందంతో
జీవిస్తుంది అందరికీ ఆదర్శంగా ఉంటారు. ఇంత పొగడ్తలకు వేమన అర్హుడు కాడా అంటే విడమరిచి చెప్పిన తర్వాత మీరు ఇంతకన్నా బాగా పొగుడుతారు. పార్వతీ దేవి, తల్లి భూమి దానిని దున్ని విత్తులు వేసేది తండ్రి దానివల్ల వచ్చే పంట సంతానం, ప్రతి వ్యవసాయ కుటుంబాల్లో ను పంటతో పాటు పాడి ఉంటుంది. పాలు, పెరుగు, మజ్జిగ అవి సర్వం నూతన వధూవరులకు పురోహితుడు చెప్పే మాట ధర్మ మార్గంలో డబ్బులు సంపాదించు, ధర్మమార్గంలో కామానికి తీర్చుకో, ధర్మ మార్గం లోనే ముక్తిని సాధించు ఇంతకు మించిన నీతి లేదు అని చెబుతాడు. అలా ధర్మమార్గంలో నడుస్తున్న ఈ కుటుంబం ఎంత స్వర్గసుఖాలను అనుభవిస్తుందో మనం ఊహించవచ్చు ఎవరిని మాట అనక ఎవరితోనూ మాట పడక హాయిగా గడిపే సంసారం. అంతకుమించిన లోకం ఇంకేం ఉంటుంది అందుకే వేమన పద్యాలు చదివి తీరాలి అనడం.
"వెలయ భూమి తల్లి విత్తన మటు తండ్రి పంటలరయ సుతులు పాడి పరము ధర్మము తన పాలి దైవము సిద్ధము..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి