వేమన చాప కూడు పద్ధతి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ప్రపంచంలో ఏ జీవీ ఒంటరిగా బ్రతకలేదు మనిషి గాని జంతువులు గాని పసు పక్ష్యాదులు గాని ఏవైనా సరే  ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత తోటివారిని సాటివారిని కలుపుకొని ఒక సమాజంగా ఏర్పడుతుంది. ఆ సమాజంలో ఒకరికొకరికి  మనస్పర్ధలు వచ్చి ఒకరి తత్వం మరొకరికి నచ్చక వేరు వేరు సంఘాలుగా ఏర్పడుతారు దానికి పేరు పెట్టుకుంటారు. కొన్ని నియమనిష్టలు ఏర్పాటు చేసుకుంటారు  మొదటి దానిలో అది నచ్చని వారు ఇంకొక పార్టీ పెడతారు. వారు కొంతమందిని చేరుస్తారు. వీరు వేరే పద్ధతిలో వారి నియమాలను ఏర్పాటు చేసుకుంటారు  ప్రపంచంలో ఎక్కడ ఏ మానవుడైనా సుఖంగా హాయిగా ఆనందంగా జీవించాలని కదా  కోరుకుంటాడు. అంతా కలిసి ఒక కుటుంబంగా ఉండి ఒక మాట మీద ఉంటే ఎంత అందంగా ఉంటుంది దానికి మరొకరు  మతాల పేరిట, కులాల పేరిట, వర్గాల పేరిట వర్ణాల తీరుతో ఎన్ని మార్పులు వచ్చాయి. ఎన్ని తీర్లు బయటకు వచ్చాయో చెప్పలేము. ఒకరి ఆహార వ్యవహారాలు మరొకరికి ఇష్టం ఉండదు ఒకరి జీవనవిధానం మరొకరికి కుదరదు. దానితో తగాదాలు కోపాలు కార్పణ్యాలు పెరిగి ఒకరినొకరు చంపు కోవడానికి కూడా  వెనుకాడని పద్ధతులు వచ్చాయి. ఆనాడు బసవేశ్వరుని కాలంలో  వీరశైవం పరిపాలించిన  రోజులలో కుల భేదాలు, వర్గ భేదాలు లేవు అందరూ అందరినీ సమానంగానే  చూశారు. మరి అక్కడ ఏ పొరపొచ్చాలు రాలేదు. తర్వాత బ్రహ్మనాయుడు కలం వచ్చేసరికి  నూతన పద్ధతిలో చాప కూడు అన్న పేరుతో భోజనాలు చేయడం ఏర్పాటు చేశారు. ఆ వచ్చిన వాడి కులాన్ని, మతాన్ని చూడరు. ఎవరు ముందు వస్తే వారు ఆ చాప మీద కూర్చుని హాయిగా భోజనం చేస్తారు. ఎవరూ ఎవరిని ఎగతాళి చేయడం కానీ, చిన్న బుచ్చడం కానీ, నవ్వులాటలు కానీ ఆ సమయంలో వుండవు.
ఆ తర్వాత ఎంతో మంది ప్రవక్తలు వచ్చి ఎంత ప్రయత్నించినా అందరిని  ఒకటిగా చేయలేకపోయారు.  చివరకు గాంధీగారు కొంతమంది యువకులను పోగుచేసి అందరిని నా సోదరులుగానే భావిస్తున్నాను  అందరూ సమైక్యంగా ఉండాలి అని ఎంతో ప్రయత్నం  చేశారు  చివరకు రమణ మహర్షి గారి ఆధ్యాత్మిక చింతనలో కూడా భోజనాల సమయంలో ఒక వర్గానికి వేరువేరుగా ఏర్పాటు చేయడంతో  మహర్షి కలగజేసుకుని  తన కుడిచేతి పక్కన కొందరు ఎడమచేతి ప్రక్కన కొందరు కూర్చోవాలని చెప్పారు. గాంధీ గారి శిష్యులలో నిజాయితీగా పని చేసిన గోరా ( గోపరాజు రామచంద్రరావు గారు) వారి సిద్ధాంతాన్ని మళ్ళీ చాప కూడునే సామూహిక పద్ధతిని  ఏర్పాటు చేసినా, వినో బాజీ కూడా పూర్తిగా ఫలవంతం కాలేదు. ఇలాంటి స్థితిని  భరించలేక వేమన గారు రాసిన  పద్యం.
"పృథ్వి వారికెల్ల నొక్క
కంచము పెట్టి 
పొత్తు గుడిపి కులము పొలయ జేసి 
తలను చెయ్యి పెట్టి తగ నమ్మ జెప్పరొ..."


కామెంట్‌లు