ధన మూల మిదమ్ జగత్ అన్నది ప్రాచుర్యంలో ఉన్న జాతీయం. ఈ ప్రపంచంలో ధనం లేకుండా జీవితం గడవదు ఏ పని చేయవలసి వచ్చినా దానికి ధనం కావాలి అదే జగతిని నడుపుతోంది అంటారు. జ అంటే పుట్టడం, గతి అంటే మరణించడం. రాత్రి నిద్ర పోతాం ఉదయం కన్ను తెరుస్తాం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ప్రతి క్షణం ధనం తోనే ముడిపడి ఉంది అది లేకుండా ఏ పనీ జరగదు. ఒక వ్యక్తికి అనుకోకుండా విపరీతమైన ధనం వచ్చింది అనుకుందాం. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది నిజానికి అలా జరిగితే గుండె ఆగిపోతుంది చనిపోతాడు కానీ అది ఇక్కడ అప్రస్తుతం అంతకుముందు పేదరికంలో అతనికి ఎన్ని ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటిని క్రియారూపంలో మన ముందు ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పనులు చాలవు. పేరు ప్రతిష్టలు కూడా పెరగాలి అతను ఏది చెబితే అది జరిగి తీరాలి. అందరూ నా దగ్గర చేతులు కట్టుకొని కూర్చోవాలి అన్న ఆలోచనలు అన్నీ పెరుగుతాయి. రాజు గారి దగ్గర ఉన్న ఉద్యోగస్తులు అంతా ఆయన మాట కాదనగలరా? ఇక్కడ కూడా అంతే లోకులు పలు కాకులు అన్నది వింటూనే ఉంటాం. ఆ కాకి ఎందుకు అరుస్తుంది ఎవరి ఇంట్లోనయినా నాలుగు ఎంగిలి మెతుకులు కనిపిస్తే దాని చుట్టుపక్కల అందరిని రమ్మని పిలవడానికి ఆ కేక అని అందరూ అనుకుంటారు. కానీ కాకి ఏమని అరుస్తుంది కావ్ కావ్ అని కావ్ అంటే రక్షించమని అర్థం. ఆకలితో నకనకలాడుతున్న నాకు మరికొంచెం అన్నం పెట్టమని అర్థం. కానీ కర్రను విసిరికొట్టి దాన్ని దూరంగా పంపుతాడు అదీ ప్రస్తుత స్థితి. ఇక ధనికుడు ఏది చెపితే అది వేదం. దానికి వేమన అద్భుతమైన ఉపమానం చెప్పాడు. ఒక జమీందారు గారి ఇంట్లో ఉన్న గవ్వ కూడా విలువైనది. అలాంటి స్థితే ఇక్కడ కూడా వేమన మరో సందర్భంలో చెప్పినట్లు ఎంత విజ్ఞానాన్ని సంపాదించినా ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, కాసులు ఉన్నవాళ్ల బానిస కొడుకులు అని దూషించాడు. ఇక్కడ దానినే కొంచెం సున్నితంగా చెబుతున్నాడు. ఇది తెలిసిన తర్వాత అయినా కొంతమంది అయినా అలాంటి స్థితికి రావద్దు అని హెచ్చరిక చేయడం కోసం తన పద్ధతిలో జానపదులకు కూడా అర్థమయ్యే భాషలో తేట తెలుగులో తన ఆటవెలదిని మన ముందుంచాడు ఆ వెలదిని మీ ముందు ఉంచుతాను మీరు కూడా ఒకసారి చూడండి.
"అధముడైన మనుజుడర్ధవంతుడైన
అతని మాట నడచు నవనిలోన
గజపతింట నున్న గవ్వలు చెల్లవా..."
"అధముడైన మనుజుడర్ధవంతుడైన
అతని మాట నడచు నవనిలోన
గజపతింట నున్న గవ్వలు చెల్లవా..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి