కలి మహిమ;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సామాన్యంగా చాలా పల్లెటూర్లలో జరిగే విషయాన్ని మనం తీసుకుందాం ప్రపంచంలో ఎక్కడ ఏ మూల తీసుకున్నా అక్కడ ధనికులు ఉంటారు, బీదలు ఉంటారు  కార్మికులు ఉంటారు. ధనికులను గురించి ఆలోచించవలసిన అవసరం లేదు చేతినిండా డబ్బు ఉంటుంది కావలసిన  ప్రతి పదార్థాన్ని కొనుగోలు చేసే శక్తి వారికి ఉంటుంది కనుక  ఎవరి సాయం వారికి అవసరం లేదు  కానీ రైతు వారి  కుటుంబాలకు ధనం ఎక్కడి నుంచి వస్తుంది  సంవత్సరానికి ఒక్కసారి పంటలు చేతికి వచ్చిన తర్వాత  డబ్బులు కనిపిస్తే  ఆ వచ్చిన డబ్బు అంతకు ముందు చేసిన అప్పులకు కట్టవలసిన వడ్డీలకు  అప్పటికప్పుడు చేయవలసిన పనులకు  బొటాబొటిగా సరిపోతుంది.  అలాంటప్పుడు అతని స్థితి ఏమిటి. ఆ గ్రామంలో ఉన్న మోతుబరి దగ్గరకు కానీ  తక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చే వారి వద్దకు కానీ వెళ్లి  తన పరిస్థితిని చెప్పి మీరు ప్రస్తుతం తనకు సహాయం చేయకపోతే  ఈ సంవత్సరం వ్యవసాయం మొత్తం  పడిపోతుంది.నేను బజార్లో పడవలసి వస్తోంది  మీరే నన్ను ఆదుకోవాలి అని ప్రాధేయపడతాడు. అతని పరిస్థితి చూసిన వారు జాలిపడి కానీ, వడ్డీ వస్తుందన్న ఆశతో కానీ ధన సహాయం చేసి ఆ ఆపద నుంచి గట్టెక్కిస్తారు. ఆ డబ్బు ఇచ్చిన అతను వచ్చేంతవరకు ఆగి  అతని చేతికి డబ్బు రాగానే వెళ్లి తన బాకీ తీర్చమని  మర్యాదగానే అడుగుతాడు. అప్పటికే అతనికి వచ్చిన డబ్బులో సగం వరకు అయిపోయి ఉంటుంది. అత్యవసరంగా తీర్చవలసిన బాకీలను తీర్చుకుంటారు కదా  తాను తీసుకున్న డబ్బులు కొంచెం  ఇచ్చి మిగిలింది తర్వాత ఇస్తానని బ్రతిమలాడితే సరేనని వెళ్ళిపోతాడు  అప్పు ఇచ్చిన మనిషి. ఈ రైతు  మళ్లీ  సంవత్సరం తర్వాత  ధాన్యం అమ్మి డబ్బు వచ్చేలోపు  ఆ షాపు వాడు రెండు మూడు సార్లు  అప్పు తీర్చమని అడగడానికి వస్తాడు. ఒకటి రెండు సార్లు బాగానే ఉంటుంది తరువాత  ఏంట్రా వీడు  యమధర్మరాజు వెంట పడినట్టుగా వెంటపడుతున్నాడు.  నా పరిస్థితి తెలిసే కదా నాకు అప్పు ఇచ్చింది ఇంత తొందర పడితే ఎలా అని విసుక్కునే స్థితికి వస్తాడు డబ్బులు తీసుకునేటప్పుడు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన వాడినే  తీర్చమని అడిగినందుకు అతనిని యమధర్మరాజుతో పోల్చి ప్రచారం చేయడం  కనక వేమన  అప్పు చెయ్యని వారు ధన్యులు చేస్తే తీర్చవలసినదే అని చెప్పడానికి ఈ పద్యాన్ని మనకు చెప్పారు. ఈ పద్యాన్ని చదవండి మీరు కూడా.


"రుణ మొసంగు నాతడినుడగు తొలుదొల్త  అదియు మరల నడుగ యముడుగనగు  
అప్పు చేసి తీర్ప నరయని వారికి..."



కామెంట్‌లు