భాషలో యాసలు ;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 "ఏకం సత్  విప్రా బహుధా వదంతి" అన్న సూక్తి చాలా మంది చదివే వుంటారు అంటే  విషయం ఒకటే  దానికి ప్రచారకుడిగా ఉన్న విప్రుడు అనేక రకాలుగా ఆ విషయాన్ని స్వీకరిస్తాడు, విశ్లేషిస్తాడు. ఒక పండిట్  దగ్గర మాట్లాడడానికి సామాన్య పౌరుని దగ్గర మాట్లాడడానికి  ఒక కార్మికుని దగ్గర కర్షకుని దగ్గర మాట్లాడడానికి  పొట్టకూటి కోసం  ఇళ్లలో పాచిపని చేసే  వారితో మాట్లాడడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఒక పండితుడితో మాట్లాడినప్పుడు  సోదాహరణంగా మూలాన్ని తెలిసి మాట్లాడాలి  సామాన్యుని తో మాట్లాడేటప్పుడు  ఆ శ్లోకాన్ని వినిపించి  దానికి తెలుగు అర్థాలు అతనికి ఏ స్థాయిలో అర్థమవుతాయో ఆ పద్ధతిలో చెప్పాలి. కొంత మంది పని వాళ్ళు గుంటూరు, కృష్ణ  ప్రాంతీయ భాషకు దూరంగా ఉంటాడు. విజయనగరం శ్రీకాకుళం, ప్రాంతాల నుంచి వచ్చినవారు తెలంగాణ నుంచి వచ్చిన వారు మాట్లాడే భాష మనకు కొంచెం  విపరీతార్థాలు కానీ వ్యతిరేక అర్థాలు కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక అలాంటి వారితో మాట్లాడేటప్పుడు  వారి జాతీయాన్ని అర్థం చేసుకొని వారి 
పద్దతిలో చెపితే గాని వారికి అర్థం కాదు. మనకు ప్రత్యేకమైన మాధ్యమాలు కొన్ని ఉన్నాయి. పత్రికలలో వార్తలు ప్రచురించేటప్పుడు  ఆ పత్రికకు సంబంధించిన  ప్రచురణకర్త ఎవరైతే ఉంటారో వారి సూచనల ప్రకారం వారు ఎలాంటి పద్ధతులు అనుసరించమంటారో  తెలుసుకొని ఆ పత్రికలో రాస్తూ ఉంటారు. ఆకాశవాణి పద్ధతి వేరు  ఒక సందర్భంలో అన్నాదొరై  మరికొంత సేపటికి మరణిస్తాడు అనగా వారి సోదరి వచ్చి అన్నా మరణించావా అని ఏడ్చింది.  నిజంగానే చనిపోయాడని  ఆకాశవాణి  వార్తా విభాగ  ప్రతినిధి ఢిల్లీ ఆకాశవాణి కి ఫోన్ చేసి చనిపోయిన వార్త చెప్పాడు. ఆ తర్వాత గంట గంటన్నరకు కానీ ఆయన చనిపోలేదు  ప్రతిపక్ష నాయకుడు  జార్జి  ఫెర్నాండెస్  అభ్యతరం పెట్టగా  అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ  అధికారిక పత్రం లేకుండా ఆకాశవాణిలో ఇలాంటి ప్రకటనలు చేయవద్దు అని ఆజ్ఞను జారీ చేసింది. అదే సినిమాలో అయితే  సుసాయి గా చెబుతారు తప్ప ఇలా జరిగింది అని ఉండదు. ప్రజలు ఇలా చెప్పుకుంటున్నారు అనే వార్త చెబుతారు ఇలా ఒక ప్రచారకుడు ఒక విషయాన్ని నలుగురికీ తెలియజేయాలి అంటే  ఇక్కడ ఉన్నది ఈ భూప్రపంచం మీద భగవత్స్వరూపం ఒకటే  అహం బ్రహ్మాస్మి అన్న విషయాన్ని  ఏ స్థాయి వారికి తెలియ చేయడానికి ఆ స్థాయిలో ప్రచారం చేసే వాడు ఆ స్థాయిలోనే చెప్తాడు. అలాగే వేమన మహాశయులు తన ఆటవెలదిలో  బాటసారులు  ఆకాశంలో నక్షత్రాన్ని(రిక్క) గుర్తుపెట్టుకొని  దాని ప్రకారం నడుస్తారు  తెలిసినవాళ్లు అంతకుముందు పరిచయం ఉంటే  దానిని జ్ఞాపకం పెట్టుకుని ఆ దారిన వెళతారు.  ఆ నిజాన్ని సత్యాన్ని తెలుసుకోవాలి అనిపిస్తే  నిన్ను నీవు తెలుసుకొని ఆ బాటలో పయనించి  నిజాన్ని తెలుసుకో అని వేమన మనకు తెలియ చేస్తున్నాడు. ఆ వేమన వ్రాసిన పద్యాన్ని ఒకసారి చదవండి.


ఒక్క మనము తోడ నున్నది సకలము  
తిక్క బట్టి నరులు తిరుగుచుండ్రు
రిక్క ఎరిగి నడవ నొక్కడె చాలదా..."


కామెంట్‌లు