ఉత్తమ కులజుడు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి, విజయవాడ కేంద్రం,9492811322.
 ఆనాడు భర్తుహరి మానవుల మనస్తత్వం మూడు రకాలుగా ఉంటుంది అని వర్ణించాడు ఉత్తములు, మధ్యములు, నీచులు అని. ఉత్తముల లక్షణం తన పనిని వదులుకొని కూడా ఎదుటి వారికి పనులు చేసే ప్రవర్తన కలిగిన వారు.  మధ్యముడు తన పనులతో పాటు ఎదుటివారి పనులు కూడా చేయగలిగిన వాడు. ఇక మూడవ వాడు నీచుడు  తనకే పనీపాటా ఏమీ లేకపోయినా మీ అబ్బాయికి సాయం చేస్తానని ఆ తర్వాత భోజనం ఇచ్చి వస్తానని అన్నాన్ని మధ్యలో వదిలి వేసి  ఆ పదార్థం వాడి కి అందకుండా చేసేవాడు. ఇంకొకపద్ధతి వాడు ఉన్నాడు సహకారం చేస్తాను అంటూనే క్యారియర్ తీసుకువెళ్లి ఆ విద్యార్థికి దక్కకుండా క్యారియర్ ఇచ్చి  పశుపక్ష్యాదులకు కూడా దక్కకుండా ఇసుకలో కలిపి పనికిరాని పదార్థంగా తయారు చేస్తారు. వీడికి ఏ పేరు పెట్టాలో తెలియక తికమక పడుతున్నాను అన్నాడు  భర్తుహరి మహర్షి. వేమన వారి దగ్గరికి వచ్చేసరికి మూడు భాగాలనూ విడివిడిగా చెప్తున్నాడు తల్లిదండ్రులెవరయినా తన కుల గౌరవాన్ని నిలిపే వ్యక్తులు కావాలని కోరుకుంటారు కొడుకు పుట్టాడు అంటేనే కులాన్ని ఉద్ధరించే వాడు అని.  తల్లిదండ్రులను పున్నామ నరకం నుంచి రక్షించువాడు పుత్రుడు. నరకత్రాయతే ఇతి పుత్రః అన్నది శాస్త్రం దానికి అనుగుణంగా తమ కుమారుడు పెద్దలు సంప్రదాయాన్ని ఎలా పాటించారో దానికి అనుగుణంగా ఎలాంటి అమర్యాద జరగకుండా  మరికొంత పేరు ప్రఖ్యాతులు వచ్చే రీతిలో ప్రవర్తిస్తూ వున్న వాడిని ప్రథమ శ్రేణిలో నిలబెట్టాడు వేమన. ద్వితీయ శ్రేణి వ్యక్తులు ఉంటారు వారు ఏం చేస్తారో కూడా తెలియదు  కులం అనే శబ్దాన్ని అతను పట్టించుకొనే పట్టించుకోడు  ఎవరైనా ప్రశ్నించినప్పుడు కులం...దాన్ని పట్టించుకోవడం లేదు అనే ధోరణిలో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇంకా తృతీయశ్రేణి కొడుకు ఉంటాడు సుపుత్రా కొంప పీకరా అన్నట్లుగా ఉంటుంది అతని వ్యవహారం.  తల్లిదండ్రులు అతని మీద ఎన్నో ఆశలతో జీవిస్తూ ఉంటారు. మన వంశానికి ఉత్తముడు మంచి పేరు తీసుకు వస్తాడు అని కలలు కంటూ ఉంటారు. వీడు చేసే  ఛండాలమైన పనులు, రోజు ఒక తగాదా తేవడం ఎన్నో దురలవాట్లకు లోను కావడం   తల్లిదండ్రులకు చీకాకు కల్పించడమే తప్ప ఏ రోజూ ఆనందాన్ని అందించిన పాపాన పోరు. అలాంటి దుష్టుల్ని  కన్నందుకు తల్లిదండ్రులు ప్రతినిత్యం బాధ పడవలసిందే  తప్ప జీవితంలో వాడు బాగు పడే అవకాశమే లేదు. అలాంటి వారు ఉంటే ఏమి చనిపోతే ఏమి జనాభాలో లెక్క తప్ప వాడు చేసిన మంచి పనుల్లో ఒక్కటి కూడా లెక్కించలేము. మంచి చేయకపోగా ఆ కులాన్ని  నాశనం చేసి తీరుతాడు. ఆ స్థితి రాకూడదు అని వేమన భావన. 

"ఉద్దరింప గలుగు నుట్టముండు కులంబు   మధ్యముండు దాని మాట గలడు  
అధముడైనవాడడంగించు నొక్కట..."


కామెంట్‌లు