చూడచక్కని తెలుగు సున్నితంబు
సున్నితం ప్రక్రియతో ఉన్నతంబు
సునీత మానస జనితంబు
చూడచక్కని తెలుగు సున్నితంబు
సమీక్షల సారధి యామిని
సలహాల వారధి భవాని
అహల్య సమీక్షలుపెంచె శోభని
చూడచక్కని తెలుగు సున్నితంబు
శుక్రవారం ఉదయం అంశం
కలాలతో కవులంతా సిద్ధం
ఉన్నత సాహిత్య జననం
చూడచక్కని తెలుగు నున్నితంబు
అద్భుత కవనాల హరివిల్లులు
సరికొత్త పదాల రంగవల్లులు
ప్రశంసల పన్నీటి విరిజల్లులు
చూడచక్కని తెలుగు సున్నితంబు
సునీతగారి సున్నితపు సేవ
కవులకుచూపె వెలుగుల తోవ
కవనసేవలో సాగేటి నావ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి