తెలుగుజాతి;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఆంధ్రుల
అక్షరములు
ముత్యాలు
పలుకులు
తేనెచుక్కలు

ఆంధ్రా
ఆడువారు
అందగత్తెలు
మగవారు
మహావీరులు

ఆంధ్రుల
సాహిత్యము
అతిరమణీయము
సంగీతము
కడుశ్రావ్యము

ఆంధ్రుల
జాతిచరితములు
ప్రాచీనములు
సంప్రదాయాలు
సుసంపన్నములు

ఆంధ్రుల
వ్యవసాయము
విశిష్టము
ఫలసాయము
బహునాణ్యము

ఆంధ్రులు
ఆరంభకార్యములందు
అత్యుత్సాహులుశూరులు
అంత్యదశయండు
అలసత్వపరులు

ఆంధ్రా
పౌరుషాలకు
పోరుగడ్డ
వైషమ్యాలకు
పురిటిగడ్డ

అంధ్రులు 
చదువుసంధ్యలందు
ఆసక్తిపరులు
వృత్తిప్రవృత్తులందు
నమ్మకస్థులు

అంధ్రులు
పంతాలుపట్టింపులు
కలవారు
ఆత్మగౌరవము
అధికముగానున్నవారు

ఆంధ్రులు
నడతలందు
ముక్కుసూటిగా నడిచేవారు
వెళ్ళవద్దన్నదారుల
విర్రవీగుతూ వెళ్ళేవారు

ఆంధ్రులు
భోజనప్రియులు
పంచభక్ష్యాలు
ఆవకాయతోడు 
గోంగూరనూతిను

ఆంధ్రులు
అమ్మభాషకన్నను
ఆంగ్లభాషను
అభిమానించువారు
ఆదరించువారు

ఆంధ్రులు
తోటివారి ఎదుగుదలను
సహించలేకుండువారు
పడత్రోయుటకు
పరాయవారితోను చేతులుకలుపువారు

ఆంధ్రులార
మనచరిత్రను చదవండి
మంచిగుణపాఠాలను ఎరగండి
మనవారికోసం పాటుపడండి
మనకీర్తిని విశ్వవ్యాప్తంచెయ్యండి


కామెంట్‌లు