శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

 గుర్జర్  అనేది  ఒకజాతి కి సంబంధించిన పదం!గూజర్ అని పిల్వబడేవారు మహాశక్తి బలసంపన్నులు.ఒకప్పుడు పంజాబ్ లోనిపంచనద క్షేత్రం లో ఉండేవారట!గుంజరావాలా అనే ప్రాంతానికి వారివల్లనే పేరు వచ్చింది.గుజరాత్ గుజరఖ్ అనేపేర్లు కూడా ఆజాతికి సంబంధించినవే!వీరి చరిత్ర పంజాబ్ తో ప్రారంభం!విదేశీయులచే తరమబడి ఉత్తర రాజస్థాన్ లో ఉన్నారు. కొందరు ఢిల్లీ  అజ్మీర్  సౌరాష్ట్ర లో స్థిరపడ్డారు. గుజరాత్ ప్రాచీన పేరు లాట్ లాడ్!గూజర్లవల్ల గుజరాత్ గామారింది.దీని ప్రాచీన నామం గుర్జసా! భారతీయ  ఆర్యులు వీరు!రాజపూత్ ల గోత్రాలు వీరివి ఒకటే!బడగూజర్ గూజర్ గౌడ్ గూజర్ పఠాన్ మొదలైన కులాలున్నాయి.
గోరఖ్ పూర్ కిచెందిన ప్ర సిద్ధ యోగి  గోరఖ్ నాథ్ సంస్కృతంలో ఎన్నో రచనలు చేశారు. ఆయన పేరుమీదుగానే గోరఖ్పూర్ వచ్చింది.నేపాల్ గూర్ఖా గోరఖా  జాతివారుకూడా రాజపుత్రక్షత్రియులు!మచ్ఛేంద్రనాధ్ కూడా ఓగొప్ప యోగి! కాట్మండు లో ఆయన ఆలయం ఉంది. ఆఇద్దరు యోగుల ప్రభావం గోరఖ్పూర్ నించి కామరూప్ ప్రాంతం దాకా విస్తరించింది🌹
కామెంట్‌లు