స్వయం కృషి;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.

 తల్లి పెంపకంలో బిడ్డలు ఎంత గొప్పగా పెరుగుతారు ఆ వంశానికి ఎంత మంచి పేరు తీసుకు వస్తారు ప్రత్యక్ష నిదర్శనం మీకు తెలియజేస్తాను మా అన్న గారు శ్రీనివాస్ రెడ్డి గారు  వారి గ్రామంలో ఎన్ని ఎకరాల భూమి ఉన్నదో కూడా తెలియని ఆసామి. వారి నాన్నగారు వామపక్షపాతి  అందరి క్షేమాన్ని సంక్షేమాన్ని కోరేవాడు ఎవరు ఆకలితో అలమటిస్తున్నా భూమి లేక ఇబ్బంది పడుతున్న వారికి తన పొలంలో కొంత భాగం ఇస్తూ వుండేవారు  కమ్యూనిస్టు సిద్ధాంతాలను తుచ తప్పకుండా ఆచరించిన  మంచి మనసు కలిగిన వ్యక్తి  ఆయన మరణించే సరికి  శ్రీనివాస రెడ్డి గారికి ఉన్న ఆస్తి ఐదు రూపాయలు. ఆ గ్రామాన్ని వదిలి తల్లి కొన్న కుట్టుమిషన్ తీసుకొని బిడ్డలతో సహా ఒక మారుమూల గ్రామానికి వలస వచ్చింది. సరదాగా కొనుక్కున్న మిషన్ ఇవాళ జీవన ఆధారమైంది  తాను  కష్టపడి ఆ గ్రామంలో ఆడ వారి సహకారంతో  వారి బట్టలు కుట్టి  పిల్లల పోషణ  చేసింది  చిన్నప్పుడే ఆమె  బిడ్డలకు కష్టం విలువ తెలియజెప్పింది. రెడ్డి గారు కూడా కూలిపనులకు వెళ్లి  ఆ రోజుల్లో 24 గంటలు పని చేస్తే  రూపాయిన్నర వచ్చేది  అది తీసుకొచ్చి అమ్మకి ఇచ్చేవాడు  అలా కొన్ని సందర్భాల్లో ఆమె పస్తులు కూడా ఉండేది.  పిల్లలకు గంజి, జావలతో కడుపు నింపింది. కొంచెం వయసు వచ్చిన తరువాత  స్వయంకృషిలో ఉన్న సుఖాన్ని  అనుభవించిన వాడు కనుక  గురుముఖతః వాస్తు విషయంలో, జాతక రహస్యాలను నేర్చుకొని  ఎంతో కష్టపడి  గురువు గారి ఆశీస్సులతో  మంచి పేరు సంపాదించి  అమ్మవారిని కులదైవంగా పెట్టుకొని ఆమె ఆశీస్సులతో, ఆజ్ఞలతో  తన కార్యక్రమాలను కొనసాగించారు. అనుకూలమైన భార్య దొరకడంతో ఇద్దరు బిడ్డల్ని ఒకరిని ఇంజనీర్, మరొకరిని డాక్టర్ ని చేసి వారికి కూడా కృషి  విలువలను తెలియచేస్తే  వారు కూడా తమ విద్య వల్ల గడించిన ధనంలో చాలా వరకు సమాజ సేవకే వినియోగిస్తున్నారు.
మాతృ రుణాన్ని తీర్చుకోవడం కోసం  తన తల్లికి ఇష్టమైన పద్ధతిలో చక్కటి ఇంటిని నిర్మించి ఆమెకు అన్ని ఏర్పాట్లు చేసి అక్కచెల్లెళ్ల వివాహాలు తన భుజస్కంధాలపై వేసుకుని  ఆరోగ్యపరమైన ఉమ్మడి కుటుంబ పద్ధతిని అవలంబించారు. ఏ సాహిత్య కార్యక్రమం జరిగినా సంగీత కార్యక్రమం అయినా వచ్చి స్వయంకృషితో తాను నేర్చుకున్న పాటలను పాడి  ఆర్థికంగా సమాజాలను ఆదుకుంటున్న మనిషి ఎవరో చెప్తే వచ్చే గుణం కాదు దాతృత్వం. రక్తంలో జీర్ణమై ఉండాలి  ఆ పని జరగాలంటే  అమృతమూర్తి అమ్మ ముందుకు రావాలి  చిన్నతనంలోనే  కష్టార్జితం విలువలను తెలియజేసే బీజం వేస్తే అది మహావృక్షమై  అనేక  మందికి ఫలాలను ఇవ్వడమే కాక ఎంతోమంది బాటసారులకు  గ్రీష్మరుతువు లో కూడా నీడను అందిస్తున్న వృక్షంలా బిడ్డలు అలా తయారు కావడానికి కన్నతల్లి ప్రోత్సాహం శిక్షణతో పాటు సాధన చేయించడం  బాధ్యతగా స్వీకరిస్తే  ప్రతి బాల  బాలికలు పెరిగి పెద్దవారయిన తర్వాత మా శ్రీనివాసరెడ్డి అన్నయ్య గారి లాగా తయారు కావడానికి  అవకాశం ఉంటుంది  అందుకే అమ్మలకు ఇది నా విజ్ఞప్తి.

కామెంట్‌లు