శరన్నవ రాత్రులు- బతుకమ్మ;- సుమ కైకాల
విరుల సిరులు దెచ్చి శిఖరంబుగా పేర్చి
రంగురంగుల పూలు రమ్యముగా కూర్చి
శిఖరాగ్ర భాగాన శిఖమునే ఉంచి
గౌరమ్మగా ఎంచి పూజలే చేసి 

మగువలందరు గూడ మక్కువతో గూడి
పరవశమ్ముతో పాటలే పాడి
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ

 ఆడి పాడేరు ఆడపిల్లలంతా
 పడుచు పిల్లలూ పడతులందరూ
ముద్దుగుమ్మల్లా ముస్తాబయ్యి
రామన్న పాటలూ రాజులా పాటలు

రాగయుక్తంగా పాడుతూ తిరుగుతూ
వర్తులాకారంలో వారందరూనూ
తల్లి గౌరమ్మ తనివి తీరేలా 
మురిసి మెరిసేలా ముద్దబంతిలా

అర్చింతురమ్మా ఆ గిరితనయను
రోజోక్కతీరుగా నైవేద్యములతోడ
మన తెలుగు గడ్డపై అలనాటి
వేలనాటి సంవత్సరాల  సంస్కృతి

సాంప్రదాయం నవ రాత్రి ఉత్సవాలకు 
మరోరూపం మన ఈ తొమ్మిది రోజుల 
బతుకమ్మ పూజ మరియు పండగ
ఏరోజుకారోజే  గంగమ్మ ఒడిలో నిమజ్జనం

సుమాలు రమకు ప్రతి రూపాలు
ఆనందం మరియు ఆరోగ్య హేతువు 
అంతియే కాదు ఊరు ఊరంతా
ఉపయోగించే ఉదకం 
ఆవూరి తటాకం ఆరోగ్యహేతువుగా
 యోనగూర్చుటయే అర్థం పరమార్థం

ఆనందం ఆరోగ్యం
సమూహం సంతోషం
వనిత ముదితం వనమంతా
అందం గృహసీమ అందం
*******
బతుకమ్మ మరియు దుర్గా నవరాత్రుల
శుభాకాంక్షలు

కామెంట్‌లు