నానో కథ; సుమ కైకాల

 ఇన్వెస్టిగేషన్
హీరో స్టైల్ గా కారు దిగి కూలింగ్ గ్లాసెస్ ని ఒక చేత్తో పట్టుకుని గిర్రున పైకి ఎగరేసి మళ్ళీ స్టైల్ గా చేతిలోకి తీసుకొని పెట్టుకుంటూ డైరెక్టర్ రూంలోకి వస్తాడు.
"రండి హీరో గారు మీ యాక్షన్ తో మన సినిమా అదిరిపోవాలి. సూపర్ స్టోరీ, సూపర్ హీరో, సూపర్ డైరెక్టర్ " అన్నాడు డైరెక్టర్.
హీరో గారు మురిసిపోతూ" స్టోరీ చెప్పండి వింటాను" అన్నాడు.
"ఐ ఐ టి ఫస్ట్ రాంక్ స్టూడెంట్ మా కాలేజ్ లో చదువుకున్నాడు...మా కాలేజ్ లో చదువుకున్నాడు అని నాలుగు పేపర్స్ యాడ్స్ ఇస్తాయి. అసలు అతను ఏ కాలేజ్ లో చదువుకున్నాడో హీరో ఇన్వెస్టిగేషన్ చేయడమే మన సినిమా కథ" అంటాడు డైరెక్టర్.
ఆ...దాదాపు స్పృహ కోల్పోయినంత పనయింది హీరో గారికి😄
కామెంట్‌లు