సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 విభ్రాంతి... దిగ్భ్రాంతి
      *****
విభ్రాంతి, దిగ్భ్రాంతి పదాలు రెండూ తరచుగా ఒకే అర్థం స్ఫురించేలా తికమక పెడుతూ ఉంటాయి.
అప్పుడప్పుడూ కొన్ని సందర్భాలూ, కొన్ని సంఘటనలూ చూసి, విని విభ్రాంతికి, దిగ్భ్రాంతికి లోనవుతూ ఉంటాం.
విభ్రాంతి అంటేమనసును,ఏదో మంత్రించినట్లుగాకనికట్టు చేసి, ఆశ్చర్యం,ఆనంద పారవశ్యంలో మునిగిపోయేలా చేయడం.*
మనం ఊహించలేనంత అందమైన, అద్భుతమైన వాటిని చూసినప్పుడు కలిగే ఆశ్చర్యమే విభ్రాంతి.
 దిగ్భ్రాంతి:-  అనుకోకుండా,ఊహించకుండా జరిగిన సంఘటన లేదా సందర్భంలో  మనలో  అకస్మాత్తుగా బాధ, భయంతో కలిగే మానసిక అలజడినే దిగ్భ్రాంతి అంటాం.
మనం ఊహించని విధంగా జరిగిన సంఘటనలకు ఇచ్చే వేదనా భరిత స్పందనే దిగ్భ్రాంతి.
విభ్రాంతి ఆనందాన్ని,పరవశాన్ని కలిగిస్తే,దిగ్భ్రాంతి బాధతో కూడిన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
సాయం సంధ్యా నమస్సులతో 🙏

కామెంట్‌లు