ఎమిల్ ఓ తుంటరి మహా తెలివి గల కుర్రాడు! ఓరోజు అమ్మ ఘుమఘుమ లాడే సూప్ కాచి అందరికీ సమానంగా పంచింది.ఎమిల్ కి ఇంకా మిగిలిన సూప్ తాగాలి అని ఉంది. కాని ఇత్తడి పాత్ర అంతా ఖాళీ ఐంది. అంతా ఎవరిపనుల్లో వారు బిజీ గా ఉన్నారు. మన తుంటరి సూప్ పాత్రలోకి తొంగి చూశాడు.అట్టడుగున అతుక్కుని ఉన్న సూప్ ని నాకాలని తల అందులో దూర్చాడు.ఇంకేముంది?తల అందులో ఇరుక్కు పోయింది.ఐనా వాడు చిదానందంగా "ఎరక్కపోయి ఇరుక్కు పోయాను "అని పాడుతూ కథాకళి చేయసాగాడు.అమ్మా నాన్న ఖంగారు పడటం వాడికి వినోదం గా ఉంది. "అయ్యో!మాపుట్టింటి వారిచ్చిన40క్రోనర్ల విలువైన పాత్ర "అని అమ్మ లబలబ లాడింది.నాన్న ఏమో"డాక్టర్ 50క్రోనుల ఫీజు గుంజుతాడు" అని డబ్బు కోసం జేబులు వెతకసాగాడు.ఇంటా బైట అంతా పాత్ర లోంచి ఎమిల్ తల బైట కి గుంజే ప్రయత్నం చేసి విఫలమైనారు.ఇక డాక్టర్ దగ్గరకు లాక్కెళ్ళారు.తుంటరి ఎమిల్ అక్కడ కూడా చిలిపి ఆకతాయి గా ప్రవర్తిస్తూ తల నడుం బాగా వంచి"నమస్తే డాక్టర్!" అనగానే తలమీదనించి ధడాలున పాత్ర కింద పడి రెండు ముక్కలు ఐంది. వాడితల బైట కి వచ్చింది."నాఫీజు 50క్రోనర్లు.మీకు 10 లాభం మిగిలింది "అన్న డాక్టర్ మాటలకి నవ్వాలో ఏడ్వాలో తెలీక ఇంటిదారి పట్టారుఅంతా!🌹
తుంటరి(స్వీడన్ కథ ఆధారంగా)అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి